ఈరోజు తేదీ 21/08/2022 ఆదివారం రోజున *75 సంవత్సరాల స్వాతంత్ర్య వజ్రోత్సవాల* సందర్భంగా అనాధలకు మరియు పేదవాళ్ళకు పలు సేవా కార్యక్రమాలను హైదరాబాద్ మహానగరంలో నిర్వహిస్తూ అందులో భాగంగా ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి లోని *సహృదయ అనాధ వృద్ధ ఆశ్రమం* లోని వృద్ధులకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించిన *మన నగరం అవార్డ్ గ్రహీత MRCB చందానగర్ డైరెక్టర్ DR.తక్కలపల్లి సత్యనారాయణ రావు గారు మట్టపల్లి మోహన్ రావు మరియు Ch. శ్రీనివాస్ రావు గారు.* అనంతరం వారు ఆశ్రమం లోని వృద్ధులతో కొంతసమయం ముచ్చటించి వారి ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా Dr.తక్కలపల్లీ సత్యనారాయణ రావు గారు మాట్లాడుతూ *సహృదయ అనాధ ఆశ్రమ నిర్వాహకులు చేస్తున్న సేవలు అభినందనీమన్నారు కొనియాడారు ,వృద్ధులతో సమయం గడపడం తనకు చాలా ఆనందాన్ని ,సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు ఇలాగే ఎల్లపుడూ తన వంతు సహాయ సహకారాలు ఆశ్రమానికి అందిస్తామని* తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మోహన్ రావు గారు,వెంకటేష్వర్ రావు గారు,MRCB హోటల్ సిబ్బంది మరియు ఆశ్రమ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.