(తమ్ముని కుటుంబంపై అన్న దాడి
)
సూర్యాపేట జిల్లా.
తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలోని అనంతారం గ్రామంలో ఇద్దరు రైతుల మధ్య ఘర్షణ జరిగి గాయాలైన సంఘటన మంగళవారం రాత్రి జరిగింది. బాధితులు తెలిపి వివరాల ప్రకారం కొంపెల్లి చంద్రయ్య. కొంపెల్లి రాములు ఇద్దరు అన్నదమ్ముల మధ్య పొలం దగ్గర ఘర్షణ ఏర్పడగా రాములుకి,భార్య, అతని గాయాలైనాయని తెలిపారు. కొంపెల్లి చంద్రయ్య,అతని కుమారులు నరేష్,మధు, చిత్తలూరి యాదగిరి లు కలిసి కొంపెల్లి రాములు భార్య పై కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని తెలిపారు.రాములు తన భూమిని ఎందుకు ఆక్రమించుకొన్నారని చంద్రయ్య ను అడిగినందుకు తమపై దాడి చేశాడని వాపోయ్యారు. కొంపెళ్లి రాములు,అతని భార్య కు తీవ్రంగా గాయాలు కావడంతో చంద్రయ్య కుటుంబంపై చర్యలు తీసుకుంటామని పోలీసులకు పిర్యాదు చేసారు.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.