నారాయణపురం కస్తూర్భా పాఠశాలలో మరమ్మత్తులు చేసిన కస్తూరి ఫౌండేషన్…*

యాదాద్రి భువనగిరి జిల్లా, నారాయణపురం మండలంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని పాఠశాల సిబ్బంది ద్వారా తెలుసుకొని 2 లక్షల వ్యయంతో (ప్లంబింగ్ వర్స్క్,ఫ్యాన్స్,ట్యూబ్ లైట్స్,నూతన మోటార్,C C కెమెరాల రిపైర్స్)మరమ్మత్తులు చేపట్టిన సందర్భంగా ఈరోజ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీ చరణ్ గారిని ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా కస్తూరి శ్రీ చరణ్ గారు మాట్లాడుతూ 2017లో కస్తూరి ఫౌండేషన్ ప్రారంభించినపుడు విద్యారంగాన్ని సేవా రంగంగా ఎంచుకొని 6 సంవత్సరాల నుండి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు.పేదరికంతో ఏ విద్యార్థి కూడా చదువుకు దూరం కావొద్దనే ఉద్దేశ్యంతోనే మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.మన ఊరి బడులను మనమే బాగుపర్చుకోవాలని,తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు నిర్మాణం ఉంటుందన్నారు.ఈ విద్యా సంవత్సరంలో మా ఫౌండేషన్ బాలికల విద్యపై,అంగన్ వాడి పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధా పెట్టమాన్నారు.కస్తూరి చరణ్ గారి చేతుల మీదగా పాఠశాలోని విద్యార్దినలకు లైబ్రరీ బుక్స్, నోట్ బుక్స్,స్టేషనరీ సామగ్రి, జూట్ బాగ్స్,గ్రామర్ బుక్స్,డిక్షనరీ బుక్స్, చైర్స్,చెత్త బుట్టలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎం.పి.పి శ్రీమతి ఉమాదేవి గారు,గ్రామ సర్పంచ్ శ్రీ చికిలమెట్ల శ్రీహరి గారు,పాఠశాల యస్.ఓ శ్రీమతి శివరంజని గారు,బిసి సంఘం నాయకులు శ్రీ వీరమల్ల కార్తిక్ గారు,రామకృష్ణ గారు,ఫౌండేషన్ సభ్యులు శ్రీ సాగర్ల లింగయ్య గారు,శ్రీ మహేష్ గారు,శ్రీ రామకృష్ణ గారు,శ్రీ పిన్నింటి నరేందర్ రెడ్డి గారు,శ్రీ జహంగీర్ గారు,పాఠశాల ఉపాద్యాయులు,గ్రామ యువకులు,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

#KasturiFoundation

By admin

Leave a Reply

Your email address will not be published.