B6 NEWS
జర్నలిస్టు ప్రమోద్ కుమార్ ను పరామర్శించిన కంచర్ల కృష్ణారెడ్డి
ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా ఉంటా: కంచర్ల
మునుగోడు న్యూస్ : నియోజకవర్గంలో ఆపదలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి అండగా ఉంటానని తెరాసా రాష్ట్ర నాయకులు కంచర్ల కృష్ణారెడ్డి అన్నారు.మండల కేంద్రానికి చెందిన జర్నలిస్టు పెరుమాల్ల ప్రమోద్ కుమార్ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతు చికిత్స పొంది ఇంటిదగ్గర విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలుకొని ప్రమోద్ ను పరామర్శించి ఆరోగ్యపరిస్థితి అడిగి వివరాలు తెలుసుకున్నారు.మెరుగైన వైద్య కోసం హైద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స చెపిస్తానని హామీ ఇవ్వడం జరిగినది.ఈ సందర్భంగా ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటానని కుటుంబసభ్యులకు బరోసా కల్పించి,తక్షణ సహాయంగ 10 వేళ రూపాయలు అందజేశారు…గ్రామ పంచాయతీ పరిధిలోని కమ్మగుడేముకు చెందిన గోరంట్ల బాలయ్య దశదిన కర్మలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి,కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.బాలయ్య కుటుంబానికి అండగా ఉంటానని బరోసా ఇచ్చి దైర్యం కల్పించారు.ఈ సందర్భంగా కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమములో నాయకులు యడవల్లి సురేష్ కుమార్, జిట్టగోనీ కృష్ణ కుమార్,బాలయ్య, పగిల్ల రాము,అంశాల శ్రవణ్, కుటుంబసభ్యులు తదితరులు పాల్గొన్నారు.