B6 NEWS
*రేపు కాకతీయ యూనివర్సిటీకి గవర్నర్ రాక*
*హైదరాబాద్:* ఆగస్టు 25వ తేదీ గురువారం తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయానికి రానున్నారు. యూనివర్సిటీలో జరిగే 22వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా గవర్నర్ హాజరుకానున్నారు.
యూనివర్సిటీలో పరిశోధనలు పూర్తి చేసిన వారికి పీహెచ్ డీ పట్టాలు, బంగారు పతకాలను గవర్నర్ ప్రదానం చేయనున్నారు.ఈ మేరకు గవర్నర్ పర్యటన గురించి కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రమేష్ మంగళవారం మీడియాకు వెల్లడించారు.గురువారం గవర్నర్ తమిళి సై కాకతీయ యూనివర్సిటీకి రానున్నారని తెలిపారు.
యూనివర్సిటీలో పరిశోధనలు పూర్తి చేసిన 56 మందికి పీహెచ్ డీ పట్టాలు,బంగారు పతకాలను గవర్నర్ ప్రదానం చేస్తారని ఆయన వెల్లడించారు.2018-19 సంవత్సరాలో వివిధ విభాగాలలో 56 మందికి గవర్నర్ పీ హెచ్ డీ పట్టాలు, విశ్వవిద్యాలయంలోని ఆయా విభాగాలలో 192 మందికి 276 బంగారు పతకాలను తెలంగాణ రాష్ట్ర గవర్నర్,కాకతీయ యూనివర్సిటీ ఛాన్స్ లర్ తమిళిపై సౌందరరాజన్ ప్రదానం చేస్తారని వైస్ ఛాన్స్ లర్ తెలిపారు.