B6 NEWS

పేదరిక నిర్ములనే ఆసరా ఫౌండేషన్ లక్ష్యం.: ఆసరా ఫౌండేషన్ చైర్మన్ బొల్లా శివశంకర్

పేదరిక నిర్ములనే ఆసరా ఫౌండేషన్ లక్ష్యం అని ఆసరా ఫౌండేషన్ చైర్మన్ బొల్లా శివశంకర్ అన్నారు.ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా గట్టుప్పల్ లో జరిగిన మెగా హెల్త్ క్యాంప్ ను ఆయన ప్రారంభించి ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న నిరుపేదల ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఈ హెల్త్ క్యాంప్ నిర్వహించమన్నారు.ఈ హెల్త్ క్యాంప్ లో కంటి పరీక్షలు , ఈ సి జి , షుగర్ , బీపీ లాంటి పరీక్షలు చేసి ఉచితంగా వైద్యం ,మందులు అందిస్తున్నమన్నారు.దాదాపు 700 మందికి పైగా వైద్య శిబిరంలో ఉచిత సేవలు వినియోగించుకున్నారన్నరు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఈడం రోజా మాట్లాడుతూ ఆసరా ఫౌండేషన్ నిరుపేదల కోసం చేస్తున్న సేవలను కొనియాడారు.నూతన మండలం లో వైద్య శిబిరం ని నిర్వహించడం చాలా సంతోషాదాయకం అన్నారు.భవిష్యత్ లో ఇంకా మరిన్ని కార్యక్రమలు చెప్పట్టాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మండల సాధన సమితి కన్వీనర్ ఈడం కైలాసం , మాజీ సర్పంచ్ లు నామని జగన్నాధం , పోరెడ్డి ముత్తిరెడ్డి , భీమగాని మల్లేశం , కర్నాటి శ్రీనివాస్ , బీపీఎల్ గౌడ్ , ఫౌండేషన్ సభ్యులు ఖమ్మం రాజశేఖర్ , చేరుపల్లి రమేష్ , అబ్బాస్ , నవీన్ , మహేష్ తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.