B6 NEWS
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372వ జయంతి
దళిత శక్తి ప్రోగ్రామ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజులపాటు నిర్వహిస్తున్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాల్లో బాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం సర్వేలు గ్రామంలో పాపన్న గౌడ్ 372వ జయంతి నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా జిల్లా కమిటీ సభ్యులు, నారాయణ పురం మండల అధ్యక్షులు సంజీవ మహారాజ్ మాట్లాడుతూ పాపన్న గౌడ్ బహుజనులు ఆత్మగౌరవం అని స్వరాజ్య స్థాపనకు స్ఫూర్తి….అని
గోల్కొండ కోటను పరిపాలించిన యోధుడు…
ఆయన స్పూర్తితో మనం స్వరాజ్యాన్ని తెలంగాణలో వెంటనే స్థాపించాల్సిన అవసరం ఉంది అన్నారు… ఈ కార్యక్రమంలో సుర్వి యాదయ్య గౌడ్ గారు, వీరమళ్ళ పెద్ద వెంకటయ్య గౌడ్ గారు, చెర్ల నర్సింహా గౌడ్ గారు , బాలాగోని శ్రీను గౌడ్ గారు,నలపరాజు రమేష్ గారు వీరమళ్ళ భాస్కర్ గౌడ్ గారు, తెలుకుంట్ల ప్రకాష్ గుప్త గారు, మండల ఉపాధ్యక్షులు సాయి మహారాజ్, ప్రధాన కార్యదర్శి శివరాజ్ మహారాజ్, సభ్యులు నగేష్, సుఖేందర్, గ్రామ ప్రధాన కార్యదర్శి సందీప్, రాజు, కోశాధికారి గణేష్ అలాగే వెంకటేష్, నవీన్, నరేష్, వంశీ, శివాజీ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
దళిత శక్తి ప్రోగ్రాం – DSP సర్వేలు గ్రామ శాఖ