B6 NEWS
యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ముందు ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని విఆర్ఎ లు చేస్తున్నటువంటి సమ్మె నేటికీ 38వ రోజుకి చేరుకుంది వినాయక చవితి పండుగను సైతం లెక్కచేయకుండా వీఆర్ఏ లు సమ్మెను కొనసాగిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు అమలు చేయాలని వీఆర్ఏల సమస్యలు పరిష్కరించే అంతవరకు రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ సంఘం పిలుపు మేరకు సమ్మెను కొనసాగిస్తామని యాదాద్రి జిల్లా కో కన్వీనర్ పొట్ట మైసయ్య మండల గౌరవ అధ్యక్షులు మేకల వెంకటేష్ తెలిపారు ఇట్టి కార్యక్రమంలో మండల వి ఆర్ ఎ సంఘం నాయకులు అయినటువంటి మహమ్మద్ మునీర్ గాలిబు దుర్గయ్య రాములు లక్ష్మయ్య సాయి తదితరులు పాల్గొన్నారు