B6 NEWS
భూపాలపల్లి జిల్లా
నిరుపేద దళితులు సాగు చేసుకుంటున్న భూమికి పట్టాలి ఇవ్వాలి
సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్..
గత 50 సంవత్సరాల నుండి నిరుపేద దళితులు సాగు చేసుకున్న భూములకు పట్టాలు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని సిపిఐ యంయల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ అన్నారు. టేకుమట్లకి వచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారికి అసైన్మెంట్ భూములకు పట్టాలు ఇవ్వాలని మల్లేష్ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
ప్రభుత్వం అసైన్మెంట్ భూములను పల్లె ప్రకృతి వనాలకు స్మశాన వాటిక స్థలాలకు ప్రభుత్వం కేటాయిస్తా ఉన్నది అని తెలిపారు. నిరుపేద దళితులు ఆ భూమి పైన ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళు నష్టపోతున్నారని, అట్లాంటి భూములన్నిటికీ పట్టాలివ్వాలని కలెక్టర్ గారిని కోరారు. ధరణి వ్యవస్థలో ఇప్పటివరకు అలాంటి భూములనుచేర్చిన దాఖలు కానరావడం లేదని, ప్రభుత్వం దళితులను ప్రత్యక్షంగా మోసం చేస్తా ఉన్నది, వందల ఎకరాలు ఉన్నటువంటి వాళ్లకు రైతు బందు ఇస్తున్నది అని పేర్కొన్నారు. ఐదారు గుంటలు ఉన్నటువంటి దళితులకు మాత్రం పట్టాలివ్వడంలో మోసం చేస్తున్నదని, తక్షణమే అసైన్మెంట్ భూములకు పట్టాలు ఇవ్వాలని కోరారు.