B6 NEWS
భూపాలపల్లి జిల్లా
సంక్షేమానికి చెరగని చిరునామా వైఎస్సార్.
భూపాలపల్లి జిల్లాలో వైఎస్ఆర్ కి ఘన నివాళి
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 13 వ వర్ధంతి సందర్భంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన వైయస్సార్ తెలంగాణ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు అప్పం కిషన్. అనంతరం వృద్ధులకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కిషన్ మాట్లాడుతూ భూపాలపల్లి జిల్లల్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు జిల్లా ప్రాంత ప్రజల గుండెల్లో ఇప్పటికీ శిరస్థాయిగా ఉన్నాయన్నారు, రాజశేఖర్ రెడ్డి గారు రాష్ట్రమే తన కుటుంబంగా భావించి రాష్ట్ర సంక్షేమం కోసం పరితపించ్చి బ్రతికిన మనిషి అని వైయస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకకాలంలో పూర్తి రుణమాఫీ చేసి,ఉచిత విద్యుత్ అందించి, ఇందిరమ్మ ఇల్లు,ఫీజు రియంబర్స్మెంట్ , ఆరోగ్యశ్రీ, జెంబో DSC వేసి అనేక సంక్షేమ పథకాలను రూపొందించి ప్రజలకు చేరువైన మరపురాని మహానేతని అన్నారు జిల్లాలో వైఎస్ఆర్ చేసిన అభివృద్ధిలో బాగంగా భూపాలపల్లి నూతన నియోజకవర్గంగా ఏర్పాటు చేసి చేల్పూర్ జెన్కో పవర్ ప్లాంట్ మరియు దేవాదుల&కంతనపల్లి ప్రాజెక్ట్ లతో పాటు కాళేశ్వరం అంతర్రాష్ట్ర బ్రిడ్జి నిర్మాణం, రైతుల కొసం అనేక చెక్ డ్యామ్లు నిర్మించి అపర భగీరధుడుగా నిలిచిన గొప్ప నాయకుడని అన్నారు.
ఈ కార్యక్రమంలో రమేష్ కమలాకర్ తిరుపతి శ్రీనివాస్ సంపత్ నవీన్ శ్రీదేవి స్వప్న మమత స్వరూప నవీన్ రవికుమార్ సుమన్ తదితరులు పాల్గొన్నారు.