యాదాద్రి భువనగిరి జిల్లా బిబినగర్ మండల పరిధిలోని వైబ్ర ఆటోమేటిక్ ప్రవైట్ లిమిటెడ్ కంపెనీ కార్మికుల సమస్యలు పరిష్కరించల
ని యాదాద్రి భువనగిరి కలెక్టర్ గారికి బీజేపీ నాయకులు గూడూరు నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణరెడ్డి గారు మాట్లాడుతూ కంపెనీ లో పని చేసిన కార్మికులకు PF,గ్యాటివిటి, అలాగే ఆరునెలల జీతం అదేవిధంగా కార్మికులు 25 సంవత్సరాలు ఒకే కంపెనీ లో పనిచేసినందుకు గాను కంపెనీ కార్మికులకు చెల్లించాల్సిన అమౌంట్ మొత్తం కలిపి ఆరు కోట్ల డెభై లక్షల రూపాయలని వారికి ఇప్పించాలని, యాజమాన్యం ఎదయితే కార్మికులకు తెలియకుండా అమ్మాలని చూస్తున్నారో వాటి పై నిషేధిత లిస్ట్ లో పెట్టాలని కొరినట్టుగా,కోర్టు వారి ఆర్డర్ కి అనుగుణంగా ఒకవేళ ఎవరైనా దానిమీద లావాదేవీలు జరపాలి అనుకున్న ముందుగా కార్మికులకు న్యాయం జరిగిన తరువాతే లావాదేవీలు జరపాలని చెప్పినట్టుగా అలాగే కంపెనీ యాజమాన్యానికి సంబంధించిన 6 ఎకరాల భూమిని వేలం వేసి అయిన లేదా ఇంకా ఏ ఇతర రూపేణా అమ్మకం చేయగా వచ్చిన ఆదాయంతో కార్మికులకు న్యాయం చేయాలని కోరగా వారు తక్షణమే ఈ సమస్యని సమీక్షించాలను స్థానిక ఆర్ డి ఓ గారిని ఆదేశించారు
వైబ్ర లో పని చేసే కార్మికులందరికి న్యాయం జరిగే వరకు వారందరికీ అండగా ఉంటానని వారి కోసం బీజేపీ పార్టీ తరపున ఎంతవరకైనా పోరాటం చేసి పెద్దన్న లాగా వారికి అండగా ఉంటానని భరోసానిచ్చారు
ఈ కార్యక్రమంలో బి ఎం ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజి రెడ్డి గారు,ప్రధాన కార్యదర్శి బొబ్బల అంజి రెడ్డి, బి భిక్షపతి, ఎం భిక్షపతి, జి బాలకృష్ణ,నరహరి,జిల్లా కార్యదర్శి జోగిరెడ్డి,పి శ్రీనివాస్ రెడ్డి,జి పాండు, తదితరులు పాల్గొన్నారు