B6 NEWS
హనుమకొండ
చలో కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయండి . SFI
విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని
ఈ నెల 5న
సోమవారం జరగబోయే చలో హనుమకొండ కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయాలని
ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మంద శ్రీకాంత్ మీశ్రీన్ సుల్తానా అన్నారు శుక్రవారం రోజున రాంనగర్లోని ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమైందన్నారు అదేవిధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తానని చెప్పి 8 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇంకా రాష్ట్రంలో ఎక్కడ కూడా అమలు కాలేదు అన్నారు అదేవిధంగా పాఠశాలలు కళాశాలలు ప్రారంభమై దాదాపు మూడు నెలలు కావస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వ పాఠశాలలో పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలు విద్యార్థులకు పూర్తిగా అందజేయలేదు అన్నారు , కనీస వసతులు వాష్రూమ్స్, సానిటైజేషన్ తాగునీరు కూడా లేవని ఆవేదన పడ్డారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలలకు వెంటనే పెయింటింగ్ వేయించాలని అదేవిధంగా విద్యార్థుల కోసం స్పోర్ట్స్ కిట్ లను విడుదల చేయాలని, పాఠశాలలో ఉన్నటువంటి వాష్రూమ్స్ లను క్లీన్ గా చేయాలని, స్కావెంజర్ పోస్టులను వెంటనే అమలుపరచాలని అన్ని డిమాండ్లను పరిష్కరించాలని. కోరుతూ ఈనెల సోమవారం రోజు ఐదో వ తేదీన జరగబోయే చలో కలెక్టరేటును విజయవంతం చేయాలని విద్యార్థుల ను ఈ సందర్భంగా వారు కోరారు. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు బొచ్చు కళ్యాణ్ మడికొండ ప్రశాంత్ స్టాలిన్ గణేష్ వర్షిత్ తదిరులు పాల్గొన్నారు