B6 NEWS
మునుగోడు మండల కేంద్రానికి చెందిన స్టార్9 న్యూస్ ఛానెల్ జర్నలిస్టు పెరుమాల్ల ప్రమోద్ కుమార్ ను
కాంగ్రెస్ రాష్ట్ర సినియర్ నేతలు డాక్టర్ చెరుకు సుధాకర్, పల్లె రవికుమార్, తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె వినయ్ కుమార్,సీనియర్ జర్నలిస్ట్ పోగుల ప్రకాశ్, వీరమల్ల రమేష్ గౌడ్, తుకారాం తదితరులు పరామర్శించారు.
ప్రమోద్ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్ లో చికిత్స పొంది ఇంటిదగ్గర విశ్రాంతి తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న వారు ఆదివారం సాయంత్రం వెళ్లి పరామర్శించి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ చెరుకు సుధాకర్ పలు సూచనలు చేసి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమములో ఐతగొని గణేష్ గౌడ్, కుమార్
తదితరులు పాల్గొన్నారు.