సీఎం కేసీఆర్ (Cm Kcr)కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjai) బహిరంగ సవాల్ (Challenge) విసిరారు. కేసీఆర్‌ది విజయనగరం (Vizianagaram) కాదని నిరూపించుకోలని ఆయన డిమాండ్ చేశారు.
దమ్ముంటే టైం.. ప్లేస్.. డిసైడ్ చేయాలని వ్యాఖ్యానించారు. ఎక్కడైతే ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకుంటారో అక్కడ నుంచే మళ్లీ పాదయాత్ర చేస్తానని చెప్పారు. తెలంగాణలోని పలు పథకాలకు కేంద్రం నిధులిస్తోందని తెలిపారు. పెద్దోళ్ల గడీలు బద్దలు కొడతామని పేదోళ్లకు న్యాయం చేస్తామన్నారు. పాతబస్తీలో ప్రజా సంగ్రామ యాత్ర (Prajasangrama Yatra)ను అడ్డుకుంటే ఊరుకోమని బండి సంజయ్ హెచ్చరించారు.