B6 NEWS
మాలలకు గౌరవం ఇచ్చే పార్టీకే మద్దతిస్తాం :చింతపల్లి లింగమయ్య
బిజెపి ని ఓడించాలని డిమాండ్
మునుగోడు న్యూస్: భారతీయ జనతా పార్టీ జిల్లా మండల కమిటీలలో దళితులకు సముచిత స్థానం కల్పిస్తున్నారా అని మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు చింతపల్లి లింగమయ్య ప్రశ్నించారు.మండల కేంద్రంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీలో అత్యంత కీలకంగా పనిచేసే పదాధికారుల ఎంపికలో మాల సామాజిక వర్గానికి చెందిన ఒక్కరిని కూడా నియమించ కపోవడం మాలల పట్ల వివక్ష అని ఆరోపించారు. బీజేపీలో ఎంతో నిబద్ధతతో మాలలు పనిచేస్తున్నప్పటికీ వారిని అణగదొక్కే ప్రయత్నాలు చేయటం వారిని అవమానపరచడమేనన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపిని ఓడించడానికి గ్రామ గ్రామాన మాలలను చైతన్య పరుస్తామని అన్నారు ఎన్నికలు వచ్చినప్పుడే మాలలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకొని వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలలో పనిచేస్తున్న మాలలకు ఆయా పార్టీలు తగిన గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో భూతం అర్జున్, నాగిళ్ల మారయ్య, అద్దంకి వెంకటయ్య ,ఈద నరేష్ ,కాశీమల్ల ప్రవీణ్ కుమార్, కట్ట వెంకన్న ,గాలి శ్రీనివాస్ ముచ్చ పోతుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.