B6 NEWS
భూపాలపల్లి జిల్లా
*వీఆర్ఏల సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వ పతనం తప్పదు..*
*సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్..* *నియోజకవర్గ కార్యదర్శి కసర వేణి కుమార్..*
టేకుమట్ల మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయం ముందు దీక్ష చేస్తున్నటువంటి వీఆర్ఏల కు మద్దతు తెలియజేస్తూ 47 రోజులుగా దీక్ష చేస్తున్నటువంటి వీఆర్ఏలు వాళ్ల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పేసి ఆరోపిస్తున్నాం 27 మంది వీఆర్ఏలు మనోవేదన గురై చనిపోతూ ఉంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మొండిగా వైఖరిస్తా ఉంది చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నటువంటి వీఆర్ఏలు 47 రోజులకు దీక్ష చేస్తూ వాళ్లకు జీతాలు రాక అల్లాడుతూ వాళ్ల కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని చెప్పేసి అని మనోవేదన గురై గుండెపోటుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నారు అయినా ప్రభుత్వానికి దున్నపోతు మీద వాన పడ్డ చందంగా ఉంది అసెంబ్లీ సాక్షిగా ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని వారు చేసినటువంటి డిమాండ్స్ న్యాయమైనవే పే స్కేల్ అమలు చేయాలని అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మంజూరు చేయాలని మూడుసార్లు హామీ ఇచ్చిన ప్రభుత్వం అమలు చేయడం మాత్రం పూర్తిగా విఫలమైందని చెప్పేసి ఆరోపిస్తా ఉన్నాను తక్షణమే వీఆర్ఏల ఆత్మహత్యలను ఆపాలని వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం వారి సమస్యలు పరిష్కారం అయ్యేవరకు ప్రత్యక్షంగా పరోక్షంగా మా మద్దతు ఉంటుందని తెలియజేస్తున్నాం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వానికి రానున్న కాలంలో పతనం తప్పదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం అని అన్నారు.