మునుగోడులో ఘనంగా విగ్నేశ్వరుని నిమజ్జన శోభ యాత్ర
గణపతి నవరాత్రి వేడుకల్లో భాగంగా మునుగోడు మండల కేంద్రములో అంబేద్కర్ యువజన సంఘం,యూత్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం నిర్వహించిన నిమజ్జన శోభ యాత్ర పలు వీధులలో అంగరంగ వైభవంగా కొనసాగింది. ఈ సందర్భంగా పలువురు మహిళలు చిన్నారులు డిజే పాటలకు చిన్న పెద్ద తేడాలేకుండా డ్యాన్సులు వేసి ఎంజాయ్ చేశారు. శోభ యాత్రలో అద్దంకి వెంకటయ్య, పెరుమాల్ల ప్రణయ్ కుమార్,బెల్లం బాల శివరాజ్, పెరుమాల్ల రాము, బసనగర్ర రాము,గాలి జీవన్,గోలి భాను,ప్రవీణ్,శివ,ముచ్చపోతుల భరత్,పవన్,రాములు, బాజ నరేందర్,యాదయ్య తదితరులు పాల్గొన్నారు.