గ్రామాల్లోనే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. 10,032 గ్రామ సచివాలయాలను YSR హెల్త్ క్లినిక్‌లుగా నోటిఫై చేస్తున్నామని..

శిక్షణ పొందిన సిబ్బందిని ఈ క్లినిక్‌లలో నియమిస్తామంది. ఇప్పటికే 8,500 మంది గ్రాడ్యుయేట్లను ఎంపిక చేశామని.. హెల్త్ క్లినిక్‌ల కోసం 8500 భవనాలు నిర్మిస్తున్నట్లు, 14 రకాల వైద్య పరీక్షలు గ్రామస్థాయిలో చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామంది. ఈ మేరకు గ్రామ స్థాయిలో వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ మొదలు పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా ఆస్పత్రులు, అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, డీఎంహెచ్‌ఓ, డీసీహెచ్‌ఎస్‌లను ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ వైద్య కళాశాల పరిధిలోకి తేవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

కాగా ఏపీలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టును ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్నామని.. దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్న రోగులకు ఇంటికి వెళ్లి వైద్య సేవలు అందించేలా చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ కృష్ణబాబు వెల్లడించారు. ప్రతి మండలానికి నలుగురు డాక్టర్లు అందుబాటులోకి వస్తారని.. డాక్టర్ మారినా నెంబర్ మాత్రం పర్మినెంట్‌గా ఉండేలా చేస్తామన్నారు. ఏ సమస్య ఉన్న ఏ సమయంలో అయిన డాక్టర్‌కు ప్రజలు కాల్ చేసి అవకాశం కల్పిస్తామని తెలిపారు. వీటికి తర్వాత ఏరియా ఆస్పత్రి డాక్టర్ సేవలు పొందేలా చర్యలు తీసుకుంటామని.. ఏ కుటుంబానికి ఆరోగ్య సమస్య వచ్చినా మా డాక్టర్ ఉన్నారన్న నమ్మకం కల్పిస్తామని వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ కృష్ణబాబు పేర్కొన్నారు. డాక్టర్లకు ఇదో మంచి పేరు తెచ్చుకునే అవకాశమని అభిప్రాయపడ్డారు. గ్రామ స్థాయిలోనే ఎక్కువ సమస్యలు పరుష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. 42వేల పోస్టులను భర్తీ చేశామని.. ఇంకో 4 వేల మందిని నియమిస్తామని తెలిపారు. సంక్రాంతి నాటికి పూర్తిగా అందుబాటులోకి తెస్తామన్నారు. సెప్టెంబర్ మొదటి వారం నుండి పైలెట్ లాంచ్ చేసేందుకు ప్రయత్నిస్తామని.. 432 వాహనాలు రాగానే సంక్రాంతి నాటికి సిద్ధం చేస్తామని చెప్పారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *