B6 NEWS
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల నిరవధిక సమ్మెకు సిపిఎం పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు
హక్కులు సాధించే వరకు సమరశీలంగా పోరాడాలని కార్మిక వర్గానికి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బందు సాయిలు పిలుపు
కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెలో సిపిఎం పార్టీ ప్రత్యక్షంగా పాల్గొంటుందని తెలియజేస్తున్నాం.
గత నాలుగు రోజులుగా సింగరేణి వ్యాప్తంగా కాంట్రాక్ట్ కార్మిక సంఘాల రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కాంట్రాక్ట్ కార్మికులు ఈ నెల 9 నుండి నిరవాధిక సమ్మెలోకి వెళ్లారు వారి న్యాయమైన సమస్యల పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి యాజమాన్యం జేఏసీ యూనియన్ తో చర్చలు జరిపి పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం సమరశీలంగా పోరాడాలని, మీ సమస్యలు మీ సమస్యలు పరిష్కారం అయ్యేవరకు సిపిఎం పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ అండగా ఉంటుందని మద్దతు తెలియజేస్తుందని, ప్రత్యక్ష పోరాటాలలో పాల్గొంటుందని సిపిఎం పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ కార్యదర్శి బందు సాయిలు తెలియజేశారు. ఈ సందర్భంగా పత్రిక విలేకరులతో మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుంచి సింగరేణిలో పనిచేస్తున్న కాంటాక్ట్ కార్మికులకు సింగరేణి యాజమాన్యం శ్రమదోపిడికి గురిచేస్తుంది. బొగ్గు చట్టాల అమలు చేయకుండా ఆర్ అండ్ బి చట్టాలు అమలు చేస్తూ కాంట్రాక్టు కార్మికులకు అన్యాయం చేస్తుంది. పర్మినెంట్ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు కలిసి పనిచేస్తేనే కంపెనీకి ఉత్పత్తి ఉత్పాదకత లాభాలు వస్తున్నాయి .వచ్చిన లాభాలలో కాంటాక్ట్ కార్మికులకు కనీసం సౌకర్యాలు కల్పించకపోవడం అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య కాంట్రాక్ట్ కార్మికులు తమ హక్కుల కోసం నిరవధిక సమ్మెల చేస్తున్న డిమాండ్లు న్యాయమైనవి.
అందుకని యాజమాన్యం పరిష్కరించాలని కోరారు. ప్రధానంగా కాంట్రాక్ట్ కార్మికులు సింగరేణిలో ఖాళీగా ఉన్న కోటర్సును ఇవ్వమంటున్నారు. సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలి. సింగరేణి ఏరియా హాస్పిటల్ లో కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాల కూడా ఇన్ పేషంట్, ఔటుపేసెంటు వైద్య సౌకర్యం కల్పించాలి. ఓబీలలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం ఉండాలి. ప్లాస్టిక్ కార్మికులకు సెమీస్కిల్లు వేతనాలు చెల్లించాలి. వోల్వో కార్మికులకు హైలీ స్కిల్ వేతనాలు ఇవ్వాలి కన్వెన్షన్ డ్రైవర్లకు డిఏ 500 ఇవ్వాలి. అదనమైన పనికి పేమెంటు ఇవ్వాలి కాంట్రాక్ట్ కార్మికులందరికీ కనీస సౌకర్యాలు కల్పించాలి. ప్రమాదంలో చనిపోయిన ఓబీ కార్మికులకు కోటి రూపాయలు కరోనాకాలంలో చనిపోయిన కాంట్రాక్టు కార్మికులకు 15 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి .కాంట్రాక్ట్ కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి.ప్రతి నెల ఏడో తారీఖు లోపు జీతాలు చెల్లించాలి .జీవో నెంబర్ 22ను అమలు జరిపి ప్రతి కాంట్రాక్టు కార్మికునికి 24 వేల రూపాయలు నెల నెల చెల్లించాలి .ఉత్పత్తి బోనస్తోపాటు ,దీపావళి బోనస్, దసరా అడ్వాన్సులు కాంట్రాక్టు కార్మికులందరికీ ఇవ్వాలి. కార్మికులందరికీ ప్రతి నెల జీతం చిట్టీలు అందించాలి . డిమాండ్ల పరిష్కారం కోసం కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ పిలుపుమేరకు జరుగుతున్న నిరవధిక సమ్మెలో సమస్యలు పరిష్కారం అయ్యేవరకు కాంట్రాక్టు కార్మికులంతా సమరశీలంగా పోరాడాలని బందు సాయిలు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు వెలిశెట్టి రాజయ్య, ఎండి చిన్న రాజాకు పాల్గొన్నారు.