B6 NEWS 

రాహుల్ గాంధీ పాదయాత్రకు అయిలయ్య సంఘీభావ యాత్ర

సమస్యలు తెలుసుకోవడానికి ఆలేరు ప్రజల వద్దకు బీర్ల అయిలన్న

కొలనుపాక సోమేశ్వరఆలయం నుంచి సంఘీభావ యాత్ర ప్రారంభం

విచ్ఛిన్నకర శక్తుల నుంచి దేశాన్ని విముక్తి చేయడం కోసం భారత జాతిని ఏకం చేయడానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్రకు సంఘీభావంగా కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల ఐలయ్య ఆలేరులో సోమవారం నుంచి సంఘీభావ యాత్ర నిర్వహిస్తున్నారు. ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలోని సోమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సోమనాథుడి ఆశీస్సులు పొంది అక్కడి నుంచి సంఘీభావ యాత్రను మొదలుపెట్టనున్నారు.ప్రజా సమస్యలే ఏజెండగా ఈ సంఘీభావ యాత్ర కొనసాగనుంది. గ్రామ గ్రామాన పాదయాత్ర యాత్ర నిర్వహించడానికి కాంగ్రెస్ శ్రేణులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. 

ప్రజల వద్దకు ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి బీర్ల అయిలన్న

ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు కొట్లాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో కూడా నెరవేరకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి సంఘీభావ యాత్రలో భాగంగా ప్రజల వద్దకు అయిలన్న వెళ్ళనున్నాడు.

👉వరంగల్లో రాహుల్ గాంధీ నిర్వహించిన రైతు డిక్లరేషన్ను ఆలేరు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రజల వద్దకు తీసుకువెళ్లడానికి రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించిన అయిలయ్య ఇప్పుడు మరోసారి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి ప్రజా బాట పట్టారు.

👉అధికారంలోకి రావడానికి టీఆర్ఎస్ పాలకులు అనేక వాగ్దానాలు చేసి వాటిని అమలు చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందారు.

👉అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూ పంపిణీ, అర్హులైన ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని ప్రకటించిన పాలకులు గత ఎనిమిది సంవత్సరాలుగా ఇచ్చిన హామీని అమలు చేయడంలో వైఫల్యం చెందారు.

👉హైదరాబాదుకు కూతవేటు దూరంలో ఉన్న ఆలేరు నియోజకవర్గం లోని అన్ని గ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండటంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మౌలిక సమస్యలు ప్రజలను వేధిస్తున్నాయి.

👉అదే విధంగా ఆలేరు నియోజకవర్గ ప్రజల దాహార్తిని తీర్చడం తో పాటు సాగునీటిని అందించే గంధ మల్ల రిజర్వాయర్ నిర్మాణం టెండర్ల ప్రక్రియ వరకు తీసుకొచ్చి అర్ధాంతరంగా నిలిపివేశారు.

👉తపాస్ పల్లి రిజర్వాయర్ ద్వారా రాజపేట ఆలేరు మండలాలకు రావలసిన నీటిని సిద్దిపేటకు తరలిస్తున్నారు. నీటి దోపిడీకి గురవుతున్న ఆలేరు ప్రజలు సాగునీటి కొరకు ఇబ్బందులు పడుతున్న స్థానిక ఎమ్మెల్యే పట్టించుకున్న పాపాన పోలేదు.

👉అదేవిధంగా కాలువల పైన బ్రిడ్జిలు లేకపోవడం, నియోజకవర్గంలో రోడ్లు గుంతలు పడి అద్వానంగా మారడం ప్రజలకు నరకప్రాయంగా మారింది.

👉ప్రభుత్వ వైద్యం పడకేయడం, ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్స్ లో సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇంఛార్జి బీర్ల ఐలయ్య ప్రజల వద్దకు అయిలన్న అనే కార్యక్రమాన్ని నేటి నుంచి నిర్వహిస్తున్నారు.

గ్రామాల్లో పర్యటించి అక్కడ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటి పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నట్లు ఆదివారం నిర్వహించిన సమావేశంలో అయిలయ్య వెల్లడించారు.👉 తెలంగాణ తిరుపతిగా యాదాద్రిని అభివృద్ధి చేశామని గొప్పలు చెప్తున్న టిఆర్ఎస్ పాలకులు స్థానికుల బతుకుతెరువును చిద్రం చేశారని మండిపడ్డారు.

👉యాదాద్రి కొండపైకి ఆటో వాహనాలను నిలిపివేసి యాదగిరిగుట్టలో 450 మంది ఆటో కార్మికుల కుటుంబాలను టిఆర్ఎస్ ప్రభుత్వం రోడ్డు పాలు చేసిందని దుయ్యబట్టారు. 

👉నిర్వాసితులకు ఇప్పటికీ సరైన పరిహారం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నదని వివరించారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *