B6 NEWS
భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం యువత క్రీడలలో రాణించాలి
నవాబుపేట గ్రామ సర్పంచ్ కసిరెడ్డి సాయిసుధ-రత్నాకర్ రెడ్డి
గ్రామీణ స్థాయి నుంచే యువత క్రీడలలో రాణించాలని చిట్యాల మండలం, నవాబుపేట గ్రామ సర్పంచ్ కసిరెడ్డి సాయిసుధ-రత్నాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. గ్రామీణ స్థాయి యువతీ, యువకులలో క్రీడా నైపుణ్యాన్ని పెంచేంచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ క్రీడా ప్రాంగాణం నవాబుపేట గ్రామానికి మంజూరు కాగా..సర్పంచ్ నేతృత్వంలో క్రీడా ప్రాంగణ నిర్మాణ పనులు చక చక పూర్తి కాగా మంగళవారం సర్పంచ్ క్రీడా ప్రాంగణాన్ని సందర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతా..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసి క్రీడా ప్రాంగణంల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసిందని, క్రీడా ప్రాంగణం ఏర్పాటుతో విద్యార్థులు, యువతీ, యువకులు క్రీడలపై దృష్టి సారిస్తారన్నారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల నుంచి క్రీడ అణీముత్యాలను వెలుగు చూసే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు శరీర దారుఢ్యాన్ని పెంచుకోవచ్చన్నారు. క్రీడలతో స్నేహభావం పెంపొందించుకొవచ్చని, గ్రామీణ స్థాయిలో క్రీడలలో రాణించి కన్న తల్లిదండ్రులకు.. పుట్టిన జన్మభూమికి పేరు ప్రఖ్యాతులు తేవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నైనకంటి సుచరిత రెడ్డి, టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సాధ రాజు, ఫీల్డ్ అసిస్టెంట్ రాజభద్రయ్య, గ్రామ యువకులు దానవేణి ప్రవీణ్, తిరుపతి, సర్వేశం తదితరులు పాల్గొన్నారు.