B6 NEWS
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని అంగన్వాడి సెంటర్లో ఈ రోజు పోషణ మాసం ప్రోగ్రాం మొగుళ్లపల్లి -4 సెంటర్ లో నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా శ్రీమంతాలు, అన్నప్రాసన, అక్షరాభ్యాసం నిర్వహించడం జరిగింది. పోషకాహారం ప్రాముఖ్యత గురించి, తల్లిపాల ప్రాముఖ్యత గురించి, న్యూట్రి గార్డెన్ గురించి వివరించడం జరిగింది. సూపర్వైజర్ రజితమాట్లాడుతూ అంగన్వాడి బెనిఫిషరీస్ అందరూ పోషకాహారం అంగన్వాడి కేంద్రంలోని భోజనం చేయాలని, అందరూ ప్రభుత్వ ఆసుపత్రిలోని డెలివరీ కావాలని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వెంకటస్వామి పంచాయతీ సెక్రెటరీ నరేష్ ఏఎన్ఎం శ్రీలత వార్డ్ మెంబర్ శ్రీనివాస్ అంగన్వాడి టీచర్స్ వెన్నెల ర జిత, అనిత, శ్రీమత ,స్వప్న ఆశ వర్కర్, అంగన్వాడి హెల్పర్స్ గర్భిణీలు, బాలింతలు, పిల్లలు &మహిళలు పాల్గొన్నారు.