సంక్షేమ పథకాల అమలు చేయడంలో లేబర్ అధికారులు మొద్దు నిద్ర వీడాలి
తెలంగాణ ప్రగతిశీల భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం (IFTU) నారాయణపేట జిల్లా కమిటీ సమావేశం భగత్ సింగ్ భవన్ ఐ ఎఫ్ టి యు కార్యాలయంలో ఈరోజు బి నరసింహ అధ్యక్షతన జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యవక్తులుగా తెలంగాణ ప్రగతిశీల భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం హన్మేస్ పాల్గొని మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో లేబర్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. సత్వరమే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని పెండింగ్, లో ఉన్న డెలివరీ డెత్ మ్యారేజ్ గిఫ్ట్, డబ్బులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు తాపీ మేస్త్రి లకు మూడు వేల పెన్షన్ పథకాన్ని రూపొందించే అమలు చేయాలని డిమాండ్ చేశారు కార్మికుల పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వాలని కోరారు, గ్రామాలు మండల కేంద్రాల్లో సంఘాన్ని పటిష్టం చేయాలని కార్మిక నాయకులకు పిలుపునిచ్చారు సంఘ నిర్మాణ కోసం భవన నిర్మాణ కార్మికులు నాయకులు కృషి చేయాలని పిలిపించారు దేశంలో నిర్మాణరంగం విస్తృత స్థాయిలో విస్తరించి ఉందని అన్నారు.
అసంఘటితనంగా కార్మికులైన భవన నిర్మాణ కార్మికులను సంఘటితం చెయ్యాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఎస్ కిరణ్, భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షు కార్యదర్శులు బి నరసింహ రామాంజనేయులు జిల్లా నాయకులు కనక రాయుడు, నారాయణ, సాయిలు, వై సాయిలు, డి నరసింహ, చిన్న బాలు, తదితరులు పాల్గొన్నారు