పల్లె దవాఖానలో అన్ని రకాల వైద్యం అందించాలి

గోలీలతోపాటు సూదులు, గ్లూకోజులు కూడా ఇవ్వాలి

— కొండమడుగు నర్సింహ సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు

గోలీలతోపాటు సూదులు, గ్లూకోజులు కూడా ఇవ్వాలిపల్లె దవాఖానలో అన్ని రకాల వైద్యం అందించాలని, అనారోగ్యానికి గురైన ప్రజలకు గోలీలతోపాటు సూదులు, గ్లూకోజులు కూడా ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. బుధవారం భువనగిరి మండలంలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామములోని పల్లె దవఖానను సిపిఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో మండల కార్యదర్శివర్గ సభ్యులు కొండ అశోక్, శాఖ కార్యదర్శి కూకుట్ల కృష్ణ తో కలిసి సందర్శించిన అనంతరం సర్వే చేయడం, డాక్టర్ ను ప్రజలకు అందిస్తున్న వైద్యం గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నర్సింహ పాల్గొని మాట్లాడుతూ ప్రజలకు వైద్యము అందించడానికి పల్లె దవఖానలను గ్రామాలల్ల ప్రారంభించడం చాలా సంతోషమని కానీ పల్లె దవఖానలో ప్రజలకు సరైన వైద్యం అందడం లేదని ఏదన్న జబ్బు చేస్తే కేవలం మందు గోళీలు తప్ప సూదులు ఇవ్వడం లేదని గ్లూకోజు పెట్టడం లేదని అన్నారు. దీనితో ప్రజలు మళ్ళీ మండల కేంద్రానికి పోవడం తప్పడం లేదని ఆవేదన వెలిబుచ్చారు ఇప్పటికైనా ప్రభుత్వము ప్రతి పల్లె దవాఖానా లో అన్ని రకాల మందులతో పాటు సూదులు, గ్లూకోజులు కూడా ఇవ్వాలని డిమాండ్ చేసినారు. ఒక ముత్తిరెడ్డిగూడెం పరిధిలో నాలుగు గ్రామాలు ఉండడం వల్ల డాక్టరు, ఏఎన్ఎంలు ఏరోజు ఏ గ్రామంలో ఉంటారో తెలియక రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు ఇప్పటికైనా పలాన రోజు పలాన గ్రామంలో డాక్టర్లు అందుబాటులో ఉంటారని స్పష్టమైన ప్రకటన చేయాలని సూచించినారు. డాక్టర్లు సిబ్బంది కూడా సరైన సమయపాలన పాటించడం లేదని వివిధ కారణాలు చెబుతూ టైం కు రావడం లేదని అన్నారు. ఇప్పటికైనా స్పష్టమైన టైము అన్ని రకాల మందులు సూదులు గ్లూకోజులు పలాని రోజు ఫలాని గ్రామంలో ఉంటామని తెలియజేయాలని ప్రజలను ఇప్పుడు వస్తున్న సీజనల్ వ్యాధుల నుండి రక్షించాలని ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని నిర్వహించి వారికి వస్తున్న జబ్బులకు సరైన మందులు కూడా ఇవ్వాలని ఈ కాలంలో ప్రజలు అనారోగ్యాల గురికాకుండా సరైన అవగాహన కూడా కల్పించాలని ప్రభుత్వానికి నర్సింహ సూచించినారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు కొండ అశోక్, సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శి కూకుట్ల కృష్ణ, నాయకులు కొండ లక్ష్మయ్య, గ్రామ ప్రజలు ఈ కొండ చంద్రయ్య, కొండ చంద్రయ్య, మెరుగు సాయిలు, శ్రీను, వెంకయ్య ,సాయులు, కనకరాజు తదితరులు పాల్గొన్నారు*.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *