భూపాలపల్లి జిల్లా

 

చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రి పేరుకే 50 పడకల ఆసుపత్రి

నిరుపేదలకు అందని వైద్యం

చిట్యాల సూపరిండెంట్, DMHO ని సస్పెండ్ చేయాలి

వెలిశాల ప్రభుత్వ హాస్పిటల్ కి పర్మినెంట్ డాక్టర్ ను కేటాయించాలి

సిపిఐ ఎంఎల్ లిబరేషన్.జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్

 

చిట్యాల లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి పేరుకు 50 పడకల ఆసుపత్రి అందులో కనీస సౌకర్యాలు కరువైనవి నిరుపేదలకు మాత్రం వైద్యం సరైన వైద్యం అందరం లేదు ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఉంది 18 మంది డాక్టర్లు ఉండవలసిన ఆసుపత్రిలో ఆరుగురు డాక్టర్లు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు విధుల్లో ఉండవలసిన డాక్టర్లు సరైన టైంలో ఉండకుండా వంతుల వారిగా డ్యూటీలు చేస్తున్నారు డాక్టర్స్ నిర్లక్ష్యం ఉంది. పిల్లల డాక్టరు ప్రతిరోజు చూడాల్సి ఉన్నది కానీ ఒక్కరోజు కూడా పిల్లల డాక్టర్ చూసిన పరిస్థితి దాఖలు కనబడడం లేదు.ప్రతిరోజు మహిళ డాక్టర్ ఉండాల్సి ఉన్నది గర్భిణీ స్త్రీల పరిస్థితి దారుణంగా ఉన్నది. డెలివరీ అయిన పేషెంట్లను ప్రతిరోజు చూడాల్సిన బాధ్యత మహిళ డాక్టర్ పైన ఉన్నది.ఆపరేషన్ అయిన పేషెంట్లు మాత్రం విద్యుత్ కొరతతో విలువలాడుతున్నారు. హాస్పటల్లో24 గంటల విద్యుత్ సౌకర్యం కల్పించాల్సి ఉంది.కనీసం కూడా జనరేటర్ పనిచేయడం లేదు. ఎక్సరే తీయవలసిన మిషన్ కూడా పనిచేయడం లేదు షుగర్ టెస్ట్ లు చేయవలసిన వారు టైం కు రారు వచ్చిన పేషెంట్లను బెదిరింపులో గురి చేస్తున్నారు బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ చేయవలసిన సిబ్బంది సమయానికి రాకుండా వచ్చిన పేషెంట్లను బెదిరిస్తున్నారు ఇదేమిటి అని అడుగుతే నువ్వు ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకో పో అని కూడా అంటున్నారు బాత్రూంలో టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉన్న పరిస్థితి లేదు ఏదో తాత్కాలికంగా శుభ్రం చేస్తున్నామంటే చేస్తున్నామని అన్నట్టు ఉన్నది ఇబ్బందిగా ఉన్నటువంటి పేషెంట్లు టాయిలెట్స్ పోతే ఇంకో కొత్త రోగం అంటుకునే పరిస్థితి దాపురించింది. హాస్పటల్ సూపరిండెంట్ ప్రతిరోజు ఆసుపత్రి పరిస్థితిని పరిశీలించాలి కానీ ఆయన చేయడం లేదు ఆయనకు కొందరు భజన భక్తులు చెప్పిందే వింటూ చూసి చూడనట్టుగా వెళ్ళిపోతున్నాడు.ఈ వర్షకాల పరిస్థితుల్లో ప్రజలకు తీవ్రమైన విష జ్వరాలు వస్తున్నాయి హాస్పిటల్ కి వెళితే తగ్గే పరిస్థితి మాత్రం కనబడడం లేదు సరియైన వైద్యం అందగా పేద ప్రజలు విలవిల ఆడుతున్నారు జిల్లా సూపర్డెంట్ కూడా నామ్ కె వాస్తు తనిఖీలు చేస్తూ కాలయాపన చేస్తున్నాడు ఆసుపత్రిలో మెరుగైన వైద్యం కోసం మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం పేద ప్రజల పట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నటువంటి జిల్లా సూపర్డెంట్ ను చిట్యాల ఆసుపత్రి సూపర్డెంట్ ను తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రతిరోజు చిన్నపిల్లలను చూడడానికి పిల్లల డాక్టర్ గర్భిణీ స్త్రీలను చూడడానికి మహిళా డాక్టర్ను కేటాయించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం వెలిశాలలో డాక్టర్ లేని పరిస్థితి ఉన్నది డాక్టర్ బదిలీపై వెళ్లడంతో కొత్త డాక్టర్ను నియమించిన దాఖలు లేవు ఇక్కడ కూడా షుగరు మూత్ర పరీక్షలు రక్త పరీక్షలు చేసిన దాఖలు కానరావడం లేదు.పేద ప్రజల పట్ల ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు తక్షణమే వెలిశాల చిట్యాల ఆసుపత్రి నీ సందర్శించి పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని వెలిశాలలో పర్మినెంట్ డాక్టర్ నియమించాలని చిట్యాల ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని 24 గంటల విద్యుత్ సౌకర్యం కల్పించాలని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న డాక్టర్లను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం లో నాయకులు సాద శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *