B6 NEWS
టీఆర్ఎస్ లోకి బీజేపీ యూత్ నాయకుడు
దేశంలో రాష్ట్రంలో బీజేపీ అవలంబిస్తున్న విదానాలు నచ్చక,తెలంగాణ ప్రభుత్వ చేపడుతున్న సంక్షేమాభివృద్ది కార్యక్రమాలు,వరంగల్ తూర్పులో ఎమ్మెల్యే చేపడుతున్న అభివృద్ది పనులకు ఆకర్శితులై దేశాయిపేటకు చెందిన బీజేపీ యువనాయకుడు జన్ను వీరేష్ బాబు,తన అనుచరులతో ఈ రోజు శివనగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సమక్షంలో టీఆర్ఎస్ చేరారు..ఈ మేరకు ఎమ్మెల్యే వారికి కండువా కప్పి పార్టిలోకి ఆహ్వానించారు..
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కంకాల సదానందం,వనపర్తి శ్రీనివాస్,ఇనుముల నాగరాజు తదితరులు పాల్గొన్నారు..