B6 NEWS
ఊకోండిలో ఘనంగా అభయ ఆంజనేయ స్వామి కుమారస్వామి గణపతి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం
ఆలయాభివృద్ధికి 25 వేలు విరాళం అందజేసిన మాజీ ఎమ్మెల్యే
మునుగోడు : భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞాన రచయిత విశ్వకర్మ జయంతి పురస్కరించుకొని నల్గొండ జిల్లా మునుగోడు మండలములోని ఊకోండి గ్రామంలో గల శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో నూతనంగా అభయ ఆంజనేయ స్వామి, కుమారస్వామి,గణపతి విగ్రహల ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది.గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొని పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అబివృద్దికి మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 25 వేల రూపాయలు విరాళం పంపియ్యగా గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు పలువురిని శాలువాలతో ఘనంగా సన్మానించారు..ఈ కార్యక్రమములో చోల్లెటి మధనాచారి,నామొజు వెంకటేష్ చారి,జాల ముత్తిలింగం, వాడపు బాస్కారాచారి,మొరోజు స్వామి, జీలాల్ పుర్ యాదగిరి చారి,పటేల్ గూడెం జాంగయ్యచారి,బోయపళ్లి రవి గౌడ్,దేవలోకం,కీర్తి శేశులు,బ్రంహచారి,రామకృష్ణ,వెంకటేష్ చారి,బాసోజు రామాచారి,పొలోజు శంకరాచారి,చొల్లేటీ రమేష్ చారి,పోతులూరి చారి,నర్సింహా చారి,ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.