B6 NEWS
హనుమకొండ జిల్లా
ప్రపంచ వెదురు దినోత్సవం
సందర్భంగా హనుమకొండ జిల్లా మహేంద్ర వెదురు సంఘం ఆధ్వర్యంలో ఏకశిలా పార్క్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ దాస్యం వినయ్ భాస్కర్…ఈ సందర్భంగా మహేంద్ర వెదురు సంఘానికి శుభాకాంక్షలు తెలిపారు…ప్రపంచ వ్యాప్తంగా వెదురు వాడకానికి ఉన్న ప్రాముఖ్యత వివరించి.. వెదురు తయారీలను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. “ప్లాస్టిక్ వద్దు-వెదురు ముద్దు” అనే నినాదంతో ముందుకు వెళ్లాలని కోరారు.అనంతరం సంఘం సభ్యులు పలు సమస్యలను చీఫ్ విప్ దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.