జయశంకర్ భూపాలపల్లి జిల్లా

 

ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహించకుండా ప్రైవేటు ఆసుపత్రిలో నడిపిస్తున్న డాక్టర్స్

 

జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చిన సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్, చిట్యాల 50 పడగల ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం మూలంగా నిరుపేదలకు సరైన వైద్యం అందడం లేదు చిట్యాల లోని ఆరుగురు ప్రభుత్వ డాక్టర్స్ ఉన్నారు. అందులో ఒక డాక్టర్ రాస మల్ల సంతోష్ కుమార్ మిగతా డాక్టర్ల దగ్గర కొంత పారదోషం తీసుకొని రోజు విధులు నిర్వహిస్తున్నాడు అయినా మండల కేంద్రంలో ఒక ప్రైవేటు క్లినిక్ ఏర్పాటు చేసుకొని రక్త మూత్రం షుగర్ పరీక్షలు అతని ఆసుపత్రికి సిఫారసు చేస్తూ వేలాది రూపాయలు కాజేస్తున్నాడు అతని భార్య అయినా కొత్తూరు మాధవిని మహదేవ్పూర్ నుండి డిప్యూటేషన్ మీద చిట్యాల ఆసుపత్రికి వచ్చి విధులు నిర్వహిస్తున్నది పేరుకే విధులు నిర్వహిస్తున్నది ఆమె కూడా మండల కేంద్రంలో ధరణి క్లినిక్ అనే ప్రైవేట్ ఆసుపత్రిని ప్రారంభించి అందులోని ఆమె పనిచేస్తుంది చిట్యాల ఆసుపత్రి సూపర్డెంట్ అయిన డాక్టర్ జీడి తిరుపతి కూడా ఒక్కరోజు ఆసుపత్రిలో వైద్యం చేసిన దాఖలాలు లేవు డాక్టర్ లేకపోవడం మూలంగా చిన్నపిల్లలకు సరైన వైద్యం అందడం లేదు అతను కూడా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మల్లికా సూపర్ స్పెషాలిటీ అనే పిల్లల హాస్పిటల్ను ప్రారంభించుకుని తన సొంత క్లినిక్ లోనే వైద్యం చేస్తున్నాడు అదేవిధంగా డాక్టర్లు సమయపాలన పాటించడం లేదు 2022 ఏప్రిల్ లో సమయం పాలన పాటించండి డాక్టర్లపై చర్యలు తీసుకోమని డిఎంహెచ్వోలకు ఆదేశాలు ప్రభుత్వం జారీ చేసింది ఆదేశాలను సైతం పట్టించుకోవడం లేదు ప్రభుత్వ డాక్టర్లు ప్రైవేటు క్లినిక్లు నిర్వహించకూడదని 2006లో జీవో నెంబర్ 119 విడుదల చేసింది కానీ అట్టి జీవో తుంగలో తొక్కి వారి ఇష్టానుసారంగా ప్రవేట్ క్లినిక్లు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ డాక్టర్స్ చిట్యాల ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు లేవు మంచినీరు విద్యుత్తు పారిశుభ్రత జనరేటర్ ఎక్స్రే సౌకర్యాలు లేవు పరీక్షలు చేయాల్సి సిబ్బంది సమయానికి రావడం లేదు మిగతా ఆరుగురు డాక్టర్లు అసలు రాకుండా అదేవిధంగా వెలిశాల ప్రభుత్వ ఆసుపత్రి ఇన్చార్జి డాక్టర్ జయపాల్ విధులు నిర్వహించిన దాఖలాల్ లేవు డాక్టర్ బదిలీ అయి రోజులు గడుస్తున్న అతను పట్టించుకోవడం లేదు ప్రస్తుత సీజనల్ వ్యాధులకు వెళ్తున్న డాక్టర్ లేకపోవడం మూలంగా సరైన వైద్యం ప్రజలకు అందడం లేదు పర్మిషన్ డాక్టర్ ను కేటాయిస్తూ ఇన్చార్జి డాక్టర్ పై తగిన చర్యలు తీసుకోవాలి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ చిట్యాల వెలిశాల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న డాక్టర్లపై తగిన చర్యలు తీసుకోవాలి పేద ప్రజలకు సరైన వైద్యం అందే విధంగా చర్యలు తీసుకోగలరు లేనియెడల పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని డిమాండ్ చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చిట్యాల వెలిశాల ప్రభుత్వ ఆసుపత్రులపై వారం రోజులలో సర్వే నిర్వహించి హాస్పటల్ సూపర్డెంట్ పై డాక్టర్స్ పై తగిన చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు. 

 

ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి టేకుమట్ల మండల అధ్యక్షుడు అంబాల రమేష్ సంగి రాజు సదానందం పాల్గొన్నారు

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *