✍️ బీసీలకూ మునుగోడు
టికెట్ టిఆర్ఎస్ పార్టీ
ఇవ్వకపోతే బీసీ అభ్యర్థిని
బరిలో దింపుతాం…
👉ప్రస్తుతం జరిగే మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికలలో జనాభాలో 65 శాతం పైగ ఉన్న బీసీలకు టిఆర్ఎస్ పార్టీ ఈసారి అవకాశం ఇవ్వాలని, బీసీ అభ్యర్థికి టికెట్ ఇస్తే రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీ అభ్యర్థిని గెలిపించి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కానుకగా అందిస్తామని బీసీ యువజన సంఘం మునుగోడు నియోజకవర్గం అధ్యక్షులు వీరమల్ల కార్తీక్ గౌడ్ అన్నారు
నేడు సంస్థాన్ నారాయణపుర్ మండల కేంద్రంలో స్థానానికి
గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడీయ సమావేశంలో బీసీ సంఘాల నేతలతో కార్తీక్ గౌడ్ మాట్లాడుతూ ఇటీవల ఈ నెల 11వ తేదీన మునుగోడు మండల కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు జాతీయ అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా జరిగిన ఆత్మీయ అభినందన సభకు స్వచ్చందంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా వేల మంది బిసీలు తరలివచ్చి భారీ ప్రదర్శన నిర్వహించి పెద్ద ఎత్తున సభను విజయవంతం చేశారని, ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకూ ఎనిమిది గంటలసేపు బిసి సభ జరిగిందని , ఈ సభ ద్వార బీసీల ఐక్యమత్యాన్ని, బీసీల బలమైన ఆకాంక్షకు ఈ సభే నిదర్శనమని ఆయన అన్నారు.
నియోజకవర్గం ఏర్పడినప్పటి నుండి బీసీలకు అవకాశం రాలేదని, ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బిసీలకు టికేట్ ఇవ్వకుండా అన్యాయం చేశారని ఆయన అన్నారు
టిఆర్ఎస్ పార్టీ అయినా బీసీలకు అవకాశం ఇస్తే లక్ష ఓట్ల మెజార్టీతో గెలవడం ఖాయం అన్నారు, టిఆర్ఎస్ పార్టీ బీసీలకు అవకాశం ఇవ్వకపోతే బీసీలు అందరూ కలిసి ఐక్యవేదిక తరుపున గత 25 సంవత్సరాల నుండి ఢిల్లీ నుండి గల్లీ వరకు బీసీల సమస్యలపై అనునిత్యం పోరాటం చేస్తున్న బడుగు బలహీన వర్గాల నాయకుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారిని బరిలో దింపుతామని అని అన్నారు .
ఈ కార్యక్రమంలో బిసి యువజన సంఘం మండల అధ్యక్షులు కొప్పు రామకృష్ణ, కొండ నవీన్, సంజయ్, చెరక లక్ష్మణ్, శివ చారి, శివమణి, యశ్వంత్, దినేష్ ,కిరణ్ సుది తదితరులు పాల్గొన్నారు.