పెద్దపల్లి నియోజకవర్గం
మృతుల కుటుంబాలకు రూ. 14 లక్షల నష్టపరిహారం… ఎమ్మెల్యే దాసరి.
రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొని ముగ్గురు మృతి చెందారని బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని గౌరవ పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు పేర్కొన్నారు. బుధవారం మృతుల కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. అనంతరం కాంట్రాక్టర్ తో ఐదు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించి పెద్దకల్వల, నర్సాపూర్ కు చెందిన మృతులు పెగడ శ్రీనివాస్, వేణుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 13.50 లక్షల రూపాయల నష్టపరిహారం, దహన సంస్కారాలకు 50 వేల రూపాయలు ఇచ్చేలా ఒప్పించామన్నారు,ఈ కార్యక్రమంలో ఎంపీపీ బండారి స్రవంతి-శ్రీనివాస్,జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.