సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించండి.
కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి గారికి వినతి పత్రం అందజేసిన టి.ఆర్.ఎస్ నాయకులు కందుల సంధ్యారాణి.
రాష్ట్ర వ్యాప్తంగా గత 17 రోజుల నుండి 30,000 వేల మంది సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు, తమ హక్కుల సాధన కోసం చేస్తున్న నిరవధిక సమ్మె గురించి టి.ఆర్.ఎస్ నాయకులు *కందుల సంధ్యారాణి* నేడు కార్మిక శాఖ *మంత్రి మల్లారెడ్డి* గారిని కలవడం జరిగింది.
హైదరాబాద్ లోని వారి నివాసం నందు కలిసి సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలని వివరించారు.
కాంట్రాక్ట్ కార్మికులు చాలీ చాలనీ జీతాలతో కుటుంబ బారాన్ని మొస్తూ.. కోన్ని సంవత్సరాలుగా సింగరేణిలో పని చేస్తున్నారని అన్నారు.
*22 జీవో* అమలు చేసి, కార్మికులకి *హైపవర్ కమిటి* వేతనాలు అందజేయాలన్నారు.అలాగే *ఉద్యోగ భద్రత* కల్పించి *ఉచిత వైద్యం*, *క్వార్టర్ సౌకర్యం* కూడా కల్పించాలన్నారు.
17 రోజులుగా వారి డిమాండ్ల సాధనకోసం కార్మికులు వివిధ రూపాల్లో అనేక ఉధ్యమాలు చేస్తున్నారని తెలియజేసారు.
కావున మీరు సింగరేణి సీ.ఎండి గారితో చర్చించి *30,000* మంది కాంట్రాక్ట్ కార్మికులకి న్యాయం చెయ్యాగలరని ఈ సంధర్బంగా తెలియజేసి వినతి పత్రాన్ని అందజేసారు…