B6 NEWS
ఘనంగా షాహిద్ భగత్ సింగ్ 115వ జయంతి ఉత్సవాలు
💐
కాకినాడ జిల్లా లోని, PSR LAW కళాశాల, మొదటి సంవత్సరం విద్యార్థులు షాహిద్ భగత్ సింగ్ 115వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా న్యాయ విద్యార్థులు, సవరపు సుధీర్, ఉప్పల పెల్లి బాలక్రిష్ణ గార్లు మాట్లాడుతూ స్వతంత్రం కోసం 23 సంవత్సరాల అతి చిన్న వయసులో నవ్వుతూ ఉరికంబం ఎక్కిన గొప్ప వీరుడు భగత్ సింగ్ అని అన్నారు. అప్పుడున్న పార్లమెంట్ లో బాంబు వేసి బ్రిటిష్ ప్రభుత్వానికి దేశ స్వాతంత్రం యొక్క ఆవశ్యకతను తెలియజేశాడు
భగత్ సింగ్ స్పూర్తితో ముందుకు సాగాలని, స్వాతంత్రం కోసం పోరాటం చేసిన అనేక పేర్లు ముందు వరసలో ఉన్న భగత్ సింగ్ యొక్క చరిత్రను భావితరాలకు అందించేందుకు పాఠ్యాంశాల్లో చరిత్రలో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో, మొదటి సంవత్సరం న్యాయ విద్యార్థులు మహాలక్ష్మి, పవిత్ర, వంశీ రామ్, లక్కీ తదితరులు పాల్గొన్నారు.