పెద్దపల్లి నియోజకవర్గం
ట్రినిటీ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
సంస్కృతి సాంప్రదాయాలకు తెలంగాణ పుట్టినిల్లు..మున్సిపల్ చైర్ పర్సన్
*సాంస్కృతి సాంప్రదాయాలకు తెలంగాణ పుట్టినిల్లునీ గౌరవ పెద్దపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమత రెడ్డి గారు పేర్కొన్నారు. స్థానిక ట్రినిటీ జూనియర్ కళాశాలలో గురువారం బతుకమ్మ సంబరాల వేడుకలను నిర్వహించారు.. వేడుకలను గౌరవ మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమతా రెడ్డి గారు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు.. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి మున్సిపల్ చైర్ పర్సన్ గారు బతుకమ్మను నెత్తిన ఎత్తుకొని ఊరేగించారు, అనంతరం మహిళల బతుకమ్మ ఆటలను తిలకించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ గారు మాట్లాడుతూ బతుకమ్మ వేడుకలను ఆనందోత్సవాలతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. గత 20 ఏళ్లుగా అన్నిటి విద్యాసంస్థల్లో అత్యంత వైభవంగా ఆడబిడ్డలు జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ అని ఈ సంస్కృతి వారసత్వాన్ని ట్రినిటీ డిగ్రీ విద్యార్థులు ముందు తరానికి తీసుకెళ్లి ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థినులతో పాటు పెద్దపల్లి పట్టణ ప్రజలకు చైర్ పర్సన్ గారు గారు ముందస్తుగా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రాజిరెడ్డి, అనిల్, మహేందర్, మరియు విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.