భూపాలపల్లి జిల్లా
భావితరాలకు తీజ్ వారసత్వం..
– తీజ్ పండుగను రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలి..
– పలు గ్రామాల్లో జరిగిన తీజ్ వేడుకల్లో గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి రూరల్ మండలం:
ఆనవాయితీగా వస్తున్న తీజ్ పండుగ వారసత్వాన్ని భావి తరాలకు అందించేలా, మన సంస్కృతిని చాటి చెప్పేలా ఉత్సవాలు జరుపుకోవడం అభినందనీయమని భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.
ఈరోజు మండలంలోని భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బానోత్ వీధితో పాటు కమలాపూర్, గొల్ల బద్దారం, దూదేకుల పల్లి గ్రామాల్లో బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో తీజ్ ఘనంగా వేడుకలను నిర్వహించారు. ఈ గ్రామాల్లో జరిగిన తీజ్ వేడుకలకు ముఖ్య అతిథిగా
భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ గండ్ర సత్యనారాయణ రావు* హాజరయ్యారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ..
భావితరాలకు తీజ్ వారసత్వమని, ఈ పండుగను రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలన్నారు. 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి నత్యాలు, పాటలతో అంగరంగ వైభవంగా తీజ్ ఉత్సవాలు నిర్వహించడం ఆనందదాయకమని అన్నారు. పాడిపంట, గొడ్డూగోద, ఇంటిల్లిపాది ఇలా గ్రామం మొత్తం బాగుండాలని ఆ దేవుణ్ణి వేడుకున్నారు.
అందరూ వారి సంప్రదాయ వస్త్రాలను ధరించి భావి తరాలకు వాటి విశిష్టత తెలియజేయాలని కోరారు. అంతకుముందు చేసిన నృత్యాలు, పాటలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు అంబాల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ తోట సంతోష్, పైళ్ల చంద్రారెడ్డి, పిప్పాల రాజేందర్, తోట రంజిత్, నగునూరి రజినీకాంత్, చరణ్, పృధ్వీ, తిరుపతి, అజ్మీరా స్వామి, అజ్మీరా శ్రీనివాస్, అజ్మీరా ఊదానాయక్, అజ్మీరా జయపాల్, చందు, రమేష్, కోటయ్య, సురేందర్, శంకర్ తదితరులు ఉన్నరు.