హైదరాబాద్ : తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 29,590 శాంపిల్స్ పరీక్షించగా, 435 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
హైదరాబాదులో 199, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 35, రంగారెడ్డి జిల్లాలో 29 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 872 మంది ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. అదే సమయంలో 612 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు.
తెలంగాణలో ఇప్పటివరకు 8,30,815 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా… 8,23,884 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,820 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇప్పటిదాకా రాష్ట్రంలో 4,111 మంది మృతి చెందారు.