తాటి ఈత చెట్లను తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి :అనంత శ్రీనివాస్ గౌడ్

..గౌడ కులస్తులకు జీవనోపాధి దూరం చేయడానికి పాల్పడుతున్న దుశ్చర్య

..మరోసారి పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలి

మునుగోడు న్యూస్ : తాటి ఈత చెట్లను తొలగించిన వారిపై అధికారులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలనీ తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు అనంత శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.. చికటిమామిడిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహిస్తూ వారికి ఎన్నో పథకాలు ప్రవేశ పెడుతూ ఆయా కులవృత్తుల అభ్యున్నతికి పాల్పడుతున్నది.ఇందులో భాగంగానే గౌడ కులస్తులకు జీవనోపాధికి ఈత తాటి వనాల కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని గుర్తుకు తెచ్చారు..బుదవారం రోజు రాత్రి చికటిమామిడి గ్రామములో కొన్ని చోట్ల గుర్తుకు తెలియని వ్యక్తులు రోడ్డు ప్రక్కన వున్న తాటి ఈత చెట్లను తొలగించారని ,,గతములో కూడా కొన్ని సందర్భాల్లో తొలగించడం జరిగిందని,,దీని ద్వారా గీత కార్మికులు జీవనోపాధి కోల్పోవడం జరుగుతుందని,జీవనోపాధి దూరం చేయడానికే దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారని మండిపడ్డారు.వెంటనే సంబంధిత అధికారులు తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.మరోసారి ఇలాంటి సంఘటనలు ,మండలములో పునరావృతం కాకుండా చూడాలన్నారు..అదేవిధంగా గ్రామాల్లో చెట్లు నరికివేయకుండ సంబంధిత శాఖ అధికారులు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలన్నారు.ఈ సమావేశములో గౌడ సంఘం సొసైటీ అధ్యక్షుడు అనంత రవి,గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పాలకూరి కాటం గౌడ్ , గ్రామ శాఖ కార్యదర్శి మారగొని స్వామి,తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *