B6 NEWS
MNR ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు మరియు యువతకు గాని విద్యార్థులకు గాని వాళ్ల నైపుణ్యాన్ని బయటికి తీయడం కోసం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండల పుట్టపాక
గ్రామంలో క్రీడాకారులు అందరికీ క్రీడా సామాగ్రిని అందజేయడం జరిగింది ఇలాగే భవిష్యత్తులో ట్రస్ట్ సేవలు పుట్టపాకకి అవసరమని సిపిఎం సీనియర్ నాయకులు మాజీ ఉప సర్పంచ్ దొంతగాని పెద్దులు గారు అన్నారు. క్రీడా స్ఫూర్తితో యువత చెడు మార్గం వైపు వెళ్లకుండా క్రీడల్లో ప్రతిభను చూపెట్టాలని అన్నారు.ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా ఉపాధ్యక్షులు దొంతగాని అమరేందర్ గారు మాట్లాడుతూ పుట్టపాక గ్రామంలో యువత ఎక్కువగా ఉంటుంది కానీ వారికి సరైన ప్రోత్సాహం లేక క్రీడాకారుల ప్రతిభ చూపించలేకపోతున్నారు దీనిని పరిగణించిన MNR ట్రస్ట్ యువతని అన్నిరంగాలలోనూ ముందుండాలని చెప్పి క్రికెట్ కిట్లు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం గ్రామ కార్యదర్శి పిట్ట రాములు,dyfi గ్రామ కార్యదర్శి వంగురి సాయికిరణ్,కర్నాటి నరేష్ ,జోకు రామచంద్రం,వంగురి సాయికృష్ణ, క్రీడాకారులు ఎండీ హఫీజ్, గాజుల సురేష్,సంతోష్,ప్రభు,అనిల్,సత్యనారాయణ, చరణ్,తదితరులు పాల్గొన్నారు