భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు గండ్ర వెంకటరమణారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించడమే నియోజకవర్గానికి శాపంగా మారిందని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ అన్నారు.
టేకుమట్ల మండల కేంద్రంలోని మండల పార్టీ కార్యాలయంలో పత్రిక మిత్రుల సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ మాట్లాడడం జరిగింది.మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి గండ్ర వెంకట రమణారెడ్డి గారికి ఏమాత్రం సిగ్గు అనిపించడం లేదా.నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టిఆర్ఎస్ అభ్యర్థిని మూడో స్థానానికి నెట్టి నిన్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే,అధికార దాహంతో నీ భార్య zp చైర్మన్ పదవి కోసం అధికార పార్టీకి నియోజకవర్గ ప్రజల ఆత్మ గౌరవాన్ని తాకట్టుపెట్టావు,నువ్వు పార్టీ మారి ఎన్ని నిధులతో భూపాలపల్లి నియోజకవర్గం అభివృద్ధి చేశారో నియోజకవర్గ ప్రజలకు చెప్పాలి,ఎంతమంది అర్హులకు దళిత బంధు ఇప్పించారు. ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయించారు,ఏంత మందికి నిరుద్యోగులకు ఉపాధి కల్పన చేశారు,ఎంతమంది రైతులకు పంట నష్టపరిహారం అందించారు, ఎంతమంది రైతులకు రుణమాఫీ చేయించారు,భూపాలపల్లి శాసనసభ్యుడుగా ఎన్నికైన మీరు ఇవి చేయడం చేతకాక. మాయమాటలు చెబుతూ నియోజకవర్గ ప్రజలను మోసం చేస్తూ కాలయాపన చేస్తున్నారు. మీకు నియోజకవర్గ అభివృద్ధిపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే రాజీనామా చేయండి.రాజీనామా చేస్తేనే హుజురాబాద్.మునుగోడు. నియోజకవర్గ ప్రజలకు దళిత బంధు,డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, కొత్త పెన్షన్లు అన్ని అందుతున్నాయి,ఎక్కడ ఎమ్మెల్యే రాజీనామా చేస్తేనే ఆ నియోజకవర్గాల అభివృద్ధి కి ముఖ్యమంత్రి నిధులు విడుదల చేస్తున్నారు కాబట్టి.ఆ నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతున్నాయి కాబట్టి ఎమ్మెల్యే పదవికి గండ్ర వెంకటరమణారెడ్డి గారు తక్షణమే రాజీనామా చేసి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాలని మండల కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అని సతీష్ గౌడ్ అన్నారు ఈ సమావేశంలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బండ శ్రీకాంత్,మండల నాయకుడు శాస్త్రాల కిరణ్,అల్లం ఓదెలు.యువజన కాంగ్రెస్ మండల నాయకులు వైనాల యశ్వంత్.మచ్చ ప్రభాకర్.నునేటి రమేశ్,అల్లం సతీష్,కొల్గురి అనిల్.కౌడగాని అనిల్,బొచ్చు బన్నీతో పాటు ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది.