ప్రస్తుతం దేశంలో ప్రజలో పూర్తిగా విచిన్నమైన ఐక్యత భావాన్ని పెంచేందుకు గత 55 రోజులుగా రాహుల్ గాంధీ గారు చేస్తున్న భారత్ జోడో పాదయాత్రలో రాహుల్ గాంధీ గారిని కలిసి సంఘీభావం తెలిపిన యాదాద్రి భువనగిరి జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బద్దం వాసుదేవ రెడ్డి.
గడిచిన ఎనిమిదిన్నర సంవత్సరాల బిజెపి ప్రభుత్వంలో భారతదేశంలోని అన్ని వర్గాల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని వాళ్ళ సమస్యలు నేరుగా తెలుసుకోవాలని సెప్టెంబర్ నెల 7 వ తారఖున కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేస్తున్న భారత్ జో రాహుల్ గాంధీ గారి పాదయాత్రను భారతదేశ అన్ని వర్గాల ప్రజలు ఆదరించడం చూస్తుంటే ఈ బిజెపి ప్రభుత్వంలో ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతుందో అర్థం అవుతుంది కాబట్టి రాహుల్ గాంధీ గారు చేపడుతున్న భారత్ జోడో పాదయాత్రను ప్రజలు ఆశీర్వదించాలని యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వాసుదేవ రెడ్డి గారు అన్నారు అన్నారు, ఈ భారత్ జోడో యాత్రలో యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు పెద్ద ఎత్తులో పాల్గొనడం జరిగింది.