భూపాలపల్లి జిల్లా

 

కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా పాల్గోన్న ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డా.కె.వాసుదేవ రెడ్డి.

 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసిఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దివ్యాంగులకు అన్ని రకాలుగా అండగా ఉంటూ వారి ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గారు, రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కె వాసుదేవ రెడ్డి గారు అన్నారు.

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో వికలాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో రూ. 35 లక్షల వ్యయంతో 72 బ్యాటరీ ట్రె సైకిళ్లు మరియు 10 మందికి కృత్రిమ కాళ్ళను అర్హులైన దివ్యాంగులకు వారు ఉచితంగా పంపిణీ చేశారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గారు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగులకు నెలకు రూ.3016/- చొప్పున సంవత్సరానికి దాదాపు 2000 కోట్లు దివ్యాంగుల పెన్షన్ కి ఖర్చు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే దక్కింది అన్నారు. దివ్యాంగులను ఎక్కడ తీసిపోకుండా వారికి అనేక సంక్షేమ కార్యక్రమాలను అందిస్తూ వారి ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని కొనియాడారు. ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ లలో దివ్యాంగులకు 5% ప్రాతిపదికన ఇండ్లను కేటాయిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.విద్య ఉద్యోగాల్లో కూడా 4% రిజర్వేషన్లను దివ్యంగులకు కేటాయిస్తున్నారని అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని దివ్యాంగులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని వారికి హామీ ఇచ్చారు.

 

రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 30% సబ్సిడీతో మాత్రమే వికలాంగులకు సహాయ ఉపకరణాలు అందేవని కానీ తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులకు ఏ సహాయ ఉపకరణాలు అందినా అది 100% సబ్సిడీతో అందించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృఢ సంకల్పంతో రాష్ట్రంలోని వికలాంగులకు 100% సబ్సీడీ తో వికలాంగుల సహకార సంస్థ ద్వారా సహాయ ఉపకరణాలను అందిస్తున్నామని తెలిపారు. సహాయ ఉపకరణాలే కాకుండా సబ్సిడీ రుణాలు, వికలాంగుల వివాహాక ప్రోత్సాహక బహుమతితో పాటు అనేక కార్యక్రమాలతో వికలాంగులకు ప్రభుత్వం చేరువైందని గుర్తు చేశారు. 2016 వికలాంగుల చట్టం దేశంలో ఎక్కడా అమలు కావడంలేదని కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృఢ నిశ్చయంతో తెలంగాణలో మాత్రమే ఈ యాక్టు అమలవుతుందని దీని ద్వారా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల మాదిరిగానే వికలాంగులను ఎవరైనా కించపరిచినా అవమానపరిచినా వారిని చట్టం కింద శిక్షింపవచ్చునని వికలాంగులకు వివరించారు.2016 వికలాంగుల చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. భూపాలపల్లి జిల్లాలో తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ ద్వారా ఇప్పటికే 300 యూనిట్లు మంజూరు చేసామని మున్ముందు కూడా మరిన్ని యూనిట్లు మంజూరు చేసి అండగా ఉంటామని వారికి హామీ ఇచ్చారు.స్పైనల్ కార్డు, మస్క్యూలర్ డిస్ట్రోపీ వ్యాధితో బాధపడుతున్న వికలాంగుల సమస్యలతో పాటు ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో ఉన్న BIRRD మాదిరిగానే తెలంగాణలో ఉన్న వికలాంగులకు యాదాద్రి పుణ్యక్షేత్ర పరిసర ప్రాంతాల్లో కూడా ఒక ఆసుపత్రిని నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లానని వారు కూడా ఈ అంశాల పట్ల సానుకూలంగా ఉన్నారని అన్నారు. దివ్యాంగులకు అన్నవిధాలుగా అండగా ఉంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి దివ్యాంగులు కూడా అండగా ఉండాలని వారిని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్, జడ్పీ వైస్ చైర్మన్ శోభ,ఎంపీపీ లావణ్య విద్యాసాగర్ రెడ్డి,పీఏసీఎస్ చైర్మన్, డి.ఆర్.డి.ఓ పీడి పురుషోత్తమ రావు,జిల్లా సంక్షేమాధికారి శ్యామ్యూల్ తదితరులు పాల్గోన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *