మేడ్చల్ జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ మోతె వెంకట్ రెడ్డి ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ( ఐ జె యు) జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నియ్యారు. చెన్నయ్ లో మూడు రోజుల పాటు జరిగిన ఐ జె యు జాతీయ మహా సభలలో ఐ జె యు నూతన కమిటీనీ ఎన్నుకున్నారు. ఇందులో జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా వెంకట్ రెడ్డి కి స్థానం కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్ట్ ల సంక్షేమం, హక్కుల కోసం దేశ వ్యాప్తంగా నిర్విరామ పోరాటం చేస్తున్న ఏకైక యూనియన్ ఐ జె యు అని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం లో దీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న జర్నిస్టుల సమస్య లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *