ఈరోజు సిరిసిల్ల పురపాలక సంఘ పరిధిలోని తొమ్మిదవ వార్డు సర్దపూర్ లో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ను గౌరవనీయులు పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళ చక్రపాణి గారు ప్రారంభించడం జరిగింది…
ఈ సందర్భంగా గౌరవ పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళ చక్రపాణి గారు మాట్లాడుతూ… రైతు కుటుంబంలో జన్మించి వ్యవసాయంపై పూర్తి అవగాహనతో ఒక రైతుగా రైతుల శ్రేయస్సు కోసం సంక్షేమం కోసం ఆలోచించి *గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు* ఒకనాడు వ్యవసాయం దండగ అన్న స్థితి నుండి నేడు వ్యవసాయం పండగల చేసుకునే స్థితికి తీసుకురావడం కోసం అనేక విశ్లేషణలతో ప్రణాళికలతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతను ఇస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని యావత్ భారతదేశానికి ధాన్యగారంగా తీర్చిదిద్దడానికి విశేష కృషి చేస్తున్నారని అన్నారు….
గత ప్రభుత్వాల వల్ల తెలంగాణ ప్రాంతం నిర్లక్ష్యానికి గురై సరైన నీటి వసతులు లేక రైతాంగం చాలా నష్టపోయిందన గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాలేశ్వరం ఎత్తిపోతల పథకం, నదుల అనుసంధానం మిషన్ కాకతీయ, వంటి పథకాల ద్వారా భూగర్భ జలాలను పెంచి నీటిని వ్యవసాయ పొలాలకు మళ్లించి తద్వారా రైతును రాజుగా చూడాలని వారు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని కృషి చేశారు.. అంతేకాకుండ రైతుల సంక్షేమం కోసం వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ ప్రతి సంవత్సరం రెండు విడతలుగా ఎకరాకు 10000 చొప్పున పంట పెట్టుబడి సహాయాన్ని రైతు బంధు పేరుతో అందిస్తూ రైతులకు ఉచిత కరెంటును, పంట మార్పిడి విధానంలో పామాయిల్ ఇతర తోటల పెంపకాలకు ప్రోత్సాహకాలను అందిస్తూ, సమీకృత వ్యవసాయానికి ప్రోత్సహిస్తూ, రైతు కలలను, రైతు వేదికలను ఏర్పాటు చేసి వ్యవసాయ రంగాన్ని లాభసాటి రంగంగా మార్చడానికి విశేష కృషి చేస్తున్నారు అన్నారు..
గౌరవ మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు, ప్రతి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు పూర్తిస్థాయిలో చివరి గింజ వరకు వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేలా ప్రజా ప్రతినిధులను, ప్రభుత్వ అధికారు లను, రైతుబంధు సమితిలను సమన్వయం చేస్తూ ప్రతి సెంటర్లో రైతులకు మంచినీటి వసతి సదుపాయం, హమాలీల ఏర్పాటు, లారీల రవాణ సౌకర్యం, మొదలగు వసతులను ఏర్పాటు చేసేలా అన్ని చర్యలు తీసుకుంటూ A గ్రేడు రకం ధాన్యానికి 2060 రూపాయల మద్దతు ధరను, B గ్రేడ్ రకం ధాన్యం కు 2040 రూపాయల మద్దతు ధరను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందిస్తుంన్నారని అన్నారు. కాబట్టి రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని రైతులు పండించిన చివరి ధాన్యం గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేసేలా గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు గౌరవ మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు అన్ని ఏర్పాటు చేశారు కాబట్టి రైతులు ప్రభుత్వం ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే వరి ధాన్యాన్ని అమ్మాలని కోరారు…
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్ గారు, కౌన్సిలర్ సభ్యులు లింగంపల్లి సత్యనారాయణ గారు, మండల రైతు బంధు సమితి అధ్యక్షులు వోజ్జల అగ్గి రాములు గారు, ఎమ్మార్వో విజయ్ కుమార్ గారు, మెప్మా అధికారులు సిబ్బంది, మహిళా సమైక్య సంఘాల వారు మరియు రైతులు పాల్గొన్నారు…