మండల పరిధిలోని అనాజిపురం గ్రామంలో ని ఐకెపి సెంటర్ను సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పరిశీలన చేశారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి *దయ్యాల నరసింహ* గారు మాట్లాడుతూ ఈ సీజన్లో వర్షాల కారణంగా రైతులు నష్టపోయారు మిగిలిన ధాన్యాన్ని ఐకేప్ సెంటర్ కి తీసుకురాగా ఇక్కడున్న అధికారులు అలసత్వం తో కొనుగోలు ప్రారంభించకుండా ఆలస్యం చేస్తున్నారు దీనివల్ల రైతులు మరింత నష్టపోయే అవకాశం ఉన్నది కావున వెంటనే కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి యసంగి సీజన్ సందర్భంగా మాయిచ్చర్ 18 వచ్చిన కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు ఇప్పటికే కొంతమంది రైతులు దళారీలకు తక్కువ రేటుకు ధాన్యాన్ని అమ్ముకొని నష్టపోయారు కావున ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను భువనగిరి మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ikp PACS కేంద్రాలను ఏర్పాటుచేసి కొనుగోలు వేగవంతం చేయాలని అన్నారు లేనియెడల పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు గునుగుంట్ల శ్రీనివాస్, అబ్దుల్లాపురం వెంకటేష్, పాల సంఘం చైర్మన్ పాండు, కడారి కృష్ణ, ఎదునూరి రంగయ్య, గునుగుంట్ల నరసింహ, ఎదునూరి కృష్ణ, పద్మ, మమత, భాగ్య, మమత, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు