సముద్రాల అన్నారపు విజయ్ లక్ష్మి, భర్త : వెంకటేశ్వర్లు, పోచమ్మ కుంట హనుమకొండ , తన ఫిర్యాదులో బతికుండగానే చనిపోయినట్లు నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించి గిఫ్ట్ డీ డ్ చేసిన ఇంటిని తన తండ్రి సముద్రాల ఐలయ్య తండ్రి పేరు ఫకీర్, 63 సంవత్సరాలు, పోచమ్మ కుంట, హనుమకొండ, పేరు మీదుగా చేయించుకున్నాడని హనుమకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసు వారు కేసు నమోదు చేసి నిందితులను వడ్డేపల్లి రిజిస్ట్రేషన్ ఆఫీస్ వద్ద చాకచక్యంగా పట్టుకొని విచారించగా పాత గొడవలను మనసులో పెట్టుకొని కూతురు విజయలక్ష్మి మీద ఉన్న కోపంతో సముద్రాల ఐలయ్య తన భార్య సముద్రాల భాగ్య సహాయంతో మధ్యవర్తి బాబురావు, తండ్రి పేరు పైడిద, 43 సంవత్సరాలు, కులం: ఉప్పెర, నివాసం: పోచమ్మ కుంట, హనుమకొండ మరియు డాక్యుమెంట్ రైటర్ ముదురుకోల్ల రవికుమార్, తండ్రి పేరు: సమ్మయ్య, 29 సంవత్సరాలు, కులం: పూసల, డాక్యుమెంట్ రైటర్, నివాసం : గాంధీనగర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రస్తుతం టీవీ టవర్ కాలనీ హనుమకొండ సహాయంతో ఐలయ్య తన కూతురు విజయలక్ష్మి చనిపోయినట్లు నకిలీ ధ్రువీకరణ పత్రాన్ని కంప్యూటర్ ద్వారా రవి కుమార్ తేదీ: 19/05/2019 సంవత్సరంలో చనిపోయినట్లు ఎడిట్ చేసి మరణ ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించి తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తెలిపినారు. వీరి వద్దనుండి ఒరిజినల్ ఇంటి డాక్యుమెంట్స్ మరియు కంప్యూటర్ CPU, ప్రింటర్ ను సీజ్ చేయడం జరిగింది. నిందితులకు సహకరించిన మరికొంతమందిని పట్టుకుంటామని తెలిపినారు .ఇందులో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని ఏసీపి హనుమకొండ గారు అభినందించినారు. అదేవిధంగా తాము సంపాదించిన సొమ్ముతో ఏదైనా కొనాలనుకున్నప్పుడు అన్ని రకాల ఎంక్వైరీలు పూర్తి చేసుకున్న తర్వాతేనే తీసుకోవాలని అదేవిధంగా ఇలా చట్ట వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.