B6 NEWS
మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా అధికార టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రతి గ్రామంలో హామీల వర్షం కురిపించారు ఆ హామీలలో భాగంగా అల్లందేవిచెర్వు గ్రామానికి ప్రచారానికి వచ్చినప్పుడు మా గ్రామ బొడ్రాయి మీద ఒట్టేసి గొల్లగూడెం మరియు నాగంవారిగూడెం గ్రామాలకు లింకు రోడ్లు వేయిస్తానని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది మీకు సమయం ఎక్కువగా లేదు కాబట్టి వెంటనే ఆ యొక్క రోడ్డు పనులను మొదలు పెట్టవలసిందిగా డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా అల్లందేవిచెర్వు గ్రామం నూతన గ్రామపంచాయతీ ఏర్పడి ఇన్ని సంవత్సరాలు కావస్తున్నా మా గ్రామంలో రేషన్ షాపు లేక పక్కనున్న సర్వేల్ గ్రామపంచాయతీకి వెళ్లి రేషన్ సరుకులు తెచ్చుకునే సమయంలో రేషన్ సరుకులకయ్యే ఖర్చులకన్నా బస్సు కిరాయిలే ఎక్కువవుతుండడంతో మా గ్రామ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు కావున మా అల్లందేవిచెరువు గ్రామంలో వెంటనే రేషన్ షాపును ఏర్పాటు చేయాలి, మా గ్రామంలోని ప్రతి గల్లీలో సిసి రోడ్లు వేయడంతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించాలి అదేవిధంగా నూతన గ్రామపంచాయతీ బిల్డింగును నిర్మించడంతో పాటు ధరణి పోర్టల్ వలన తలెత్తిన సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము…