B6 NEWS

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో జాతీయ రహదారి మీద తంగడిపల్లి రోడ్డు వద్ద ఉన్న క్రాసింగ్ దగ్గర ఏర్పాటుచేసిన భారీ కేట్లను తొలగించాలని డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భారీ కేట్ల వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం ట్రాఫిక్ సిఐ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి ఖయ్యూం పాష మాట్లాడుతూ చౌటుప్పల్ నుండి తంగడపల్లి నారాయణపురం మునుగోడు చండూరు మండలాలకి వెళ్లడానికి ఏకైక మార్గంలో భారీ కేట్లని ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు అనేక రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు అదేవిధంగా మున్సిపల్ కేంద్రంలోని రోడ్డు అవతలి భాగంలో ఉన్నటువంటి ప్రభుత్వ దావకానికి మరియు చిన్న పిల్లల హాస్పిటల్స్ కి అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్స్ వెళ్లాలంటే వలిగొండ రోడ్డు బస్టాండ్ దగ్గర నుండి చుట్టూ తిరిగి పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు ఒకరికు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ రేట్లు పెంచుకుంటూ పేద ప్రజల నడ్డి విరుస్తుందని అన్నారు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నియంత్రణలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు వెంటనే స్పందించి మున్సిపల్ ప్రజలకు ఇబ్బందిగా ఉన్నటువంటి భారీ కేట్లను తొలగించి ప్రజలకు ఇబ్బంది కాకుండా యధావిధిగా కొనసాగించాలని కోరారు

ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మున్సిపల్ ఫ్లోర్ ఫ్లోర్ లీడర్ గోపగోని లక్ష్మణ్ గౌడ్ మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం గౌడ్ డివైఎఫ్ఐ మున్సిపల్ అధ్యక్షులు దేపరాజు నాయకులు గోషిక కరుణాకర్ ఎం డి కాసిం గంట శంకర్ రెడ్డి ఎర్ర ఉషయ్య ఎండి ఇర్ఫాన్ కాసుల లక్ష్మయ్య యాదయ్య జ్యోతిబాసు రియాజ్ యాకూబ్ తదితరులు పాల్గొన్నారు…

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *