యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలంలోని డి. రేపాక గ్రామంలో చెందిన చిప్పలపెల్లి నరసయ్య గారిది చాలా నిరుపేద కుటుంబం వారు మూడు రోజుల క్రితం హైదరబాద్ లోని జగ్గదిర్గుట్ట దగ్గర ప్రాంతంలో యాక్సిడెంట్ అయి చనిపోయిన వార్త తెలుసుకొని వారి కుటుంబానికి ఈరోజు రాపాక గ్రామంలో 50 కిలోల బియ్యం మరియు నిత్య అవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కురుమేటి నవీన్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి సహాయం చేయడానికి మాతృదేవోభవ పితృదేవోభవ ఎప్పుడు తోడుగా ఉంటుంది ఇలాంటి కార్యక్రమానికి సహకరిస్తున్న వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షులు నరేందర్ గారు, ఉపాధ్యాయులు లింగమలు గారు,రాములమ్మ గారు సంస్థ సభ్యులు చింటూ, కిషన్, నవీన్, గ్రామ యువత ,వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు