B6 NEWS

ప్రధాని ఉపన్యాసం బెదిరింపు ఉపన్యాసం చేశారు

తెలంగాణ గడ్డ వీర తెలంగాణ పోరాటాల గడ్డ ఇలాంటి బెదిరింపులకు బయపడరు

-(చెరుపల్లి సీతారాములు) సిపిఎం కేంద్ర కమిటి సభ్యులు

ప్రధాని మోడీ పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలను బెదిరించటానికి చేసిన ఉపన్యాసం లాగా ఉంది అని తెలంగాణ గడ్డ వీర తెలంగాణ సాయుధ పోరాట వారసుల గడ్డ అని ఇలాంటి భయాందోళన ఉపన్యాసాలకు తెలంగాణ ప్రజలు భయపడరని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. ఆదివారం సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ అధ్యక్షతన జరిగిన పార్టీ జిల్లా కమిటీ సమావేశంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ

తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోడీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం గానీ విభజన సమస్యల పరిష్కారం కోసం గానీ ఉపన్యాసంలో ఎక్కడ కూడా మాట్లాడలేదు. బెదిరింపు ఉపన్యాసం లాగా ప్రధాని మోడీ మాట్లాడడం తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ ప్రజలు ఖండించాలని వారు అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో జైలు పాలు అయిన వ్యక్తులను బిజెపి సమర్థించడం సిగ్గుచేటైన విషయమని వారు అన్నారు. బిజెపి ఇతర రాష్ట్రాలలో చేస్తున్న కుట్రలు తెలంగాణ రాష్ట్రంలో రెడ్ హ్యాండెడ్గా దొరికాయని రాష్ట్ర ప్రభుత్వాలను కొనుగోలు ద్వారా పడగొట్టాలని బిజెపి ప్రయత్నాలు చేస్తుందని, గవర్నర్ లను తాబేదారులుగా వాడుతున్నారని, గవర్నర్ వ్యవస్థ అవసరం లేదు అని గతంలోనే కమ్యూనిస్టులం చెప్పామని వారన్నారు దేశ ఆర్థిక వ్యవస్థను నలుగురు వ్యక్తుల చేతిలో పెట్టి ప్రభుత్వ రంగ సంస్థలను దేశ ఆర్థిక వ్యవస్థను మొత్తం సంక్షోభంలోకి నెట్టాలని బిజెపి ప్రభుత్వం చేస్తుందని ధరలు పెరగడం నిరుద్యోగం పెరగడం మతోన్మాదాన్ని మరింత పెంచడం బిజెపి కుట్రలో భాగంగా జరుగుతుందని. మూడవిశ్వాసాలను బిజెపి ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ పెంచి పోషిస్తున్నాయని వారు అన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు సిపిఎం విజ్ఞప్తి బిజెపి ఆర్ఎస్ఎస్ మతోన్మాద విధానాలను తిప్పి కొట్టాలని వారు అన్నారు. మునుగోడు ఎన్నికల్లో కమ్యూనిస్టులు అలాంటి ప్రతిభనే చూపించి తెలంగాణ గడ్డమీద బిజెపి ఆటలు సాగవని చూపించారని వారు అన్నారు. జిల్లా కార్యదర్శి ఎం డి జహంగీర్ మాట్లాడుతూ బిజెపి మతోన్మాదాన్ని మూఢవిశ్వాసాలను పెంచి పోషిస్తుంది అని ఇలాంటి విధానాలను జిల్లా వ్యాప్తంగా ఎప్పటికప్పుడు ఎదుర్కొంటూ జిల్లాలో బిజెపి ఆటలు సాగవని సిపిఎం నాయకత్వం నిరంతరం పనిచేస్తుంది అని వారన్నారు. వీరితోపాటు సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, దోనూరి నర్సిరెడ్డి, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, దాసరి పాండు, మేక అశోక్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు సిర్పంగి స్వామి, దయ్యాల నర్సింహ, బొల్లు యాదగిరి, మద్దెల రాజయ్య, ఎండి పాషా, జెల్లల పెంటయ్య, బూర్గు కృష్ణా రెడ్డి, బొడ్డుపల్లి వెంకటేష్, గుండు వెంకటనర్సు, గంగదేవి సైదులు, బండారు నర్సింహ, దొడ యాదిరెడ్డి, గడ్డం వెంకటేష్, ఎంఏ ఇక్బాల్, వనం ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *