రౌడీ’ హీరో విజయ్‌ దేవరకొండ నటించిన తొలి పాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’ . పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్‌ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

రిలీజ్‌ డేట్‌ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్‌ లో స్పీడ్‌ పెంచింది చిత్ర యూనిట్‌. దేశమంతా పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్‌ పనులు కూడా పూర్తయ్యాయి. ఈ సినిమాకి సెన్సార్‌ సభ్యులు యూ/ఏ సర్టిఫికేట్‌ జారీ చేస్తూ.. చిత్ర యూనిట్‌కి భారీ షాక్‌ ఇచ్చారు.

ఈ సినిమాలో కొన్ని అసభ్యకరమైన సీన్స్‌ ఉన్నాయని, వాటిని మార్చాలని బోర్డు సభ్యులు ఆదేశించారు. ముఖ్యంగా విజయ్‌ దేవరకొండ చెప్పే బోల్డ్‌ డైగాల్స్‌కి సెన్సార్‌ సభ్యులు అభ్యంతరం వ్యక్తంతో చేతులతో సంజ్ఞ చేసే సీన్‌ని పూర్తిగా తొలగించమని చెప్పింది. మొత్తంగా ఏడు సన్నివేశాలను మార్పులు చేయాల్సిందిగా బోర్డ్‌ ఆదేశాలు జారీ చేసింది. సెన్సార్ బోర్డు ఆదేశాల మేరకు ఆయా సీన్స్‌ను తొలగించి లైగర్ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు దర్శకనిర్మాతలు రెడీ అవుతున్నారు.

విజయ్‌ దేవరకొండ సినిమాల్లో సాధారణంగా బోల్డ్‌ సీన్స్‌, డైగాల్స్‌ ఉంటాయి. ఇక పూరీ లాంటి ఊరమాస్‌ డైరక్టర్‌ తోడైతే ఎలాంటి బోల్డ్‌ సీన్స్‌ ఉంటాయో ఊహించొచ్చు. మరి ఆ ఏడు సీన్ల తొలగింపు ప్రభావం సినిమాపై ఎలా ఉంటుందో చూడాలి. పూరి కనెక్ట్స్ , బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.